అతడే నా వరుడు!

20 Feb, 2016 22:44 IST|Sakshi
అతడే నా వరుడు!

ఇంటర్వ్యూ

చార్మి అంటే చాలామందికి ఇష్టం. కానీ చార్మికి ఏమంటే ఇష్టం? ఏం తినడం ఇష్టం? ఏం ధరించడం ఇష్టం?ఏయే ప్రదేశాలు తిరగడం ఇష్టం? ఏమేం చేయడమంటే ఇష్టం? అడిగితే ఆపకుండా చెబుతుంది. అందంగా నవ్వుతూ ఇష్టాలన్నీ  తెలుపుతుంది. ఆ నవ్వే... కుర్రాళ్ల గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది. చార్మింగ్ బ్యూటీ చార్మి ఇష్టాయిష్టాలు... మీకోసం!

 
     పుట్టినరోజు: మే 17
     ముద్దుపేరు: చార్మ్స్
     నచ్చే రంగులు: బ్లూ, వైట్, రెడ్
     నచ్చే దుస్తులు: జీన్స్, టీషర్ట్స్, చీరలు
     నచ్చే ఫుడ్: హైదరాబాదీ బిర్యానీ
     నచ్చే డ్రింక్: వైట్ గ్రేప్ జ్యూస్
     నచ్చే ప్రదేశాలు: బీచ్‌లుండే ప్రదేశం ఏదైనా ఇష్టమే.
     నచ్చే క్రీడ: క్రికెట్
     నచ్చిన సినిమా: తారే జమీన్ పర్
     నచ్చే హీరోలు: షారుఖ్, అమితాబ్
     నచ్చే హీరోయిన్లు: జూహీ చావ్లా, డింపుల్ కపాడియా, రమ్యకృష్ణ
     
హాబీలు: పుస్తకాలు విపరీతంగా చదువుతాను. శివ్ ఖేరా రాసిన మోటి వేషనల్ బుక్స్ అంటే మరీ ఇష్టం. నేను స్విమ్మింగ్ చాంపియన్‌ని కాబట్టి బాగా స్విమ్ చేస్తుంటాను. డ్యాన్స్ చేయడం, ఫ్రెండ్స్‌తో చాటింగ్... మూడ్‌ని బట్టి ఇలా ఏదో ఒకటి చేస్తుంటా.
     
బలం: ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్.
     
బలహీనత: చాక్లెట్స్. మిగిలినవాటి విషయంలో ఎంత కంట్రోల్ చేసినా, చాక్లెట్స్ విషయంలో మాత్రం నా వల్లకాదు.
     
మార్చుకోవాలనుకునేది: ఫిజికల్‌గా అయితే నన్ను నేను మొత్తం మార్చేసు కోవాలనిపిస్తుంది. నాలో ఏదీ నాకు నచ్చదు. మానసికంగా అయితే అంద రినీ నమ్మేసే బలహీనతను మార్చాలి.
     
దైవభక్తి: చాలా ఉంది. దేవుడు ఎవరైనా దేవుడే అనుకుంటాను. అందరికీ ప్రార్థన చేస్తాను. ఆంజనేయ స్వామి అంటే మాత్రం కాస్త ఎక్కువ ఇష్టం.
     
ఎదుటివారిలో నచ్చేది: అమాయకత్వం, నిజాయతీ, ప్రకృతిని ప్రేమించడం
     
ఇతరుల్లో నచ్చనిది: అపరిశుభ్రత, క్రూరత్వం
ఫిట్‌నెస్ సీక్రెట్స్: హెల్దీ డైట్, యోగా, ఏరోబిక్స్
రోల్ మోడల్: మా నాన్న. నావరకూ నాకు ఈ ప్రపంచంలో అతి తెలివైన వ్యక్తి ఆయనే అనిపిస్తుంది.
ప్రేమంటే: బలమైన స్నేహం
స్నేహమంటే: కష్టనష్టాల్లో సైతం తోడు వీడక నిలబడే బంధం

పెళ్లెప్పుడు: నేను చేసుకోవాలను కున్నప్పుడు. నాకో తోడు అవసరమని నేను ఫీలైనప్పుడు.
     
నచ్చే వరుడు: మనసుకి నచ్చేవాడు, దేవుడు మనకి రాసిపెట్టిన వాడు. నా కో-స్టార్ కావచ్చు, డెరైక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు... అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనివాడూ కావచ్చు. నాకు తగినవాడు, నా మనసు దోచినవాడే నా వరుడు.
     
ఇంకా తీరని కోరిక: ఒక్క సినిమాలో పది రకాల పాత్రలు చేయాలని ఉంది. కమల్ హాసన్ ‘దశావతారం’ చేశారు. ‘నట్టీ ప్రొఫెసర్’ చిత్రంలో ఎడ్డీ మర్ఫీ ఏడు రకాల రోల్స్ చేశారు. ఏ నిర్మాత అయినా నాకు అలాంటి అవకాశం ఇస్తే ఫ్రీగా నటిస్తా. ఎవ్వరూ ముందుకు రాక పోతే ఎప్పుడో నేనే తీసినా తీసేస్తాను.
     
వెంటాడే కల: కల అంటే నిద్రలో వచ్చే కల కాదు గానీ... నాకయితే ఓ విచిత్రమైన కల ఉంది. అదేంటంటే నేను మూనీవుడ్‌లో రారాణిని కావాలని. ఇదెక్కడుందా అనుకుంటు న్నారా! చంద్రమండలంలో. మనిషి చంద్రుడి మీద నివాసం ఏర్పరచు కోడానికి ట్రై చేస్తున్నాడు కదా! అది సక్సెస్ అవ్వాలి. చంద్రుడి  మీదికి చాలామంది వెళ్లాలి. అక్కడ కూడా సినిమాలు తీయాలి. వాటిలో నేను నటించాలి.
     
మళ్లీ జన్మంటూ ఉంటే: ఐశ్వర్యారాయ్ కళ్లు, జెన్నిఫర్ లోపెజ్ ఫిగర్, జూహీ చావ్లా లాంటి నవ్వు, ‘బాబీ’లో డింపుల్ కపాడియా చూపించి నటువంటి యాక్టింగ్ టాలెంట్, కృష్ణవంశీ లాంటి బ్రెయిన్‌తో పుట్టాలను కుంటాను. ఆ జన్మలో షారుఖ్ ఖాన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కూడా దొరకాలనుకుంటాను.

మరిన్ని వార్తలు