అల్లుడా మజాకా!

12 Oct, 2014 00:30 IST|Sakshi
అల్లుడా మజాకా!

కొన్ని కథలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తాయి. కానీ వాటిని ప్రెజెంట్ చేసే విధానం వల్ల బాగానే అలరిస్తుంటాయి. జీ టీవీలో ప్రసారమయ్యే ‘జమాయీ రాజా’ కూడా అంతే! ఏఎన్నార్ దగ్గర్నుంచి అల్లరి నరేష్ వరకూ ఎంతోమంది హీరోలు చేసిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసినట్టుగా ఉంటుందీ సీరియల్.
 
 ఓ కోటీశ్వరుడైన అబ్బాయి... ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పేదదేమీ కాదు. కానీ తాను పెరిగిన పరిస్థితుల వల్ల ఆమెకి డబ్బున్నవాళ్లంటే ఇష్టముండదు. దాంతో పేదవాడిగా నాటకమాడి ఆమె మనసును గెల్చుకుంటాడు హీరో. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆమె తల్లి అడ్డు పడుతుంది. పేదవాడు తనకు అల్లుడు కావడానికి వీల్లేదంటుంది. ఆమెను ఎదిరించి హీరోని పెళ్లాడుతుంది కూతురు. అప్పట్నుంచీ తన కూతురి జీవితంలోంచి అతడిని ఎలా దూరం చేయాలా అని ప్లాన్లు వేస్తుంటుంది అత్తగారు. వాటిని ఆ అల్లుడు ఎలా తిప్పికొడతాడు అనేదే కథ!
 
 సీరియల్‌కి పెద్ద సమస్య కథే. కాకపోతే కథనం బాగుండటం, అల్లుడిగా రవి దూబే అదరగొట్టేయడం కలసి వచ్చింది. ఒక రకంగా అతడి ఇమేజ్, టాలెంట్, ఎనర్జీలే ‘జమాయీ రాజా’ని హిట్ సీరియళ్ల లిస్టులో చేర్చాయని చెప్పవచ్చు!

మరిన్ని వార్తలు