ఆకాశమంత విశ్వాసం ఆమెది!

14 Sep, 2014 00:20 IST|Sakshi
ఆకాశమంత విశ్వాసం ఆమెది!

వంటింటిని దాటి మహిళ అడుగు బయటపెట్టి చాలా కాలమే అయినా... ఇప్పటికీ కొన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లడం ఆమెకు కష్టంగానే ఉంది. మహిళలు బలహీనులని, వారు అన్ని రకాల పరిస్థితులకూ ఎదురొడ్డలేరని మగవాళ్లు భావించడం వల్లే జరుగుతోంది. ఆ భావన తప్పు అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నమే

‘ఎయిర్‌లైన్స్’ సీరియల్!
ఎయిర్ హోస్టెస్ అనగానే ఆడపిల్లలే కరెక్ట్ అంటారు. పెలైట్ అనగానే మగవాళ్ల ఉద్యోగం అనుకుంటారు. విమానంలో సేవలు చేయగల మహిళలు విమానాన్ని నడపలేరా? ఈ ప్రశ్నే అడుగుతుంది హీరోయిన్ అనన్య. పెలైట్‌గా విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సమస్యనూ సమర్థంగా ఎదుర్కొంటుంది. మరోపక్క పురుషాధిక్యతతో ప్రతిక్షణం ఇబ్బందులు పడుతూ ఉంటుంది.

అయినా బెదరకుండా ఆకాశమంత విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటుంది. నేటి మహిళకు ప్రతిరూపంగా తీర్చిదిద్దిన అనన్య పాత్ర చాలా బాగుంది. ఆ రోల్ పోషిస్తోన్న తులిప్ జోషి కళ్లలోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆడపిల్లలు ఇలానే ఉండాలి అన్నంతగా పాత్రలో జీవిస్తోందామె. ఇంత మంచి సీరియల్‌ని ఇస్తున్నందుకు స్టార్ ప్లస్ చానెల్ వారిని అభినందించాల్సిందే!

మరిన్ని వార్తలు