ఏదీ నాటి గ్లామర్?!

24 Aug, 2014 00:48 IST|Sakshi
ఏదీ నాటి గ్లామర్?!

టీవీక్షణం: వెండితెర మీద వెలిగిన గ్లామర్ డాల్స్ అంతా ఇప్పుడు సీరియళ్ల ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోన్న సంగతి తెలిసిందే కదా! పూనమ్ థిల్లాన్, పద్మినీ కొల్హాపురి, భాగ్యశ్రీ తదితరులంతా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయారు. వారి తోవలోనే అడుగులు వేస్తోంది అనితారాజ్. ‘ప్రేమ్‌గీత్’ చిత్రంతో వెండితెర మీద తొలిసారి కనిపించిన ఈ నటీమణి... ఎనభైల్లో యువతకు నిద్రపట్టకుండా చేసింది తన అందంతో. కెరీర్ కొనసాగిస్తూనే 1986లో దర్శకుడు సునీల్ హింగోరానీని పెళ్లాడింది. 2012 వరకూ నటించినా ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించలేదు. కొంత గ్యాప్ తర్వాత అనిల్‌కపూర్ నిర్మించి, నటించిన ‘24’ టెలివిజన్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.
 
 ప్రస్తుతం ‘తుమ్హారీ పాఖీ’ సీరియల్‌లో హీరోకి తల్లిగా నటిస్తోంది. అయితే సినిమాల్లో క్లిక్ అయినట్టుగా సీరియల్స్‌లో అనిత క్లిక్ కాలేదని కచ్చితంగా చెప్పవచ్చు. దానికి కారణం... ఆమె గ్లామర్ బాగా తగ్గడమే. పూనమ్ థిల్లాన్‌నే తీసుకోండి. లావుగా అయినా కూడా ఇప్పటికీ గ్లామర్ చెక్కు చెదరలేదు. కానీ అనిత అలా లేదు. వయసు మీద పడినదానిలా కనిపిస్తోంది. దానికి తోడు ఆమె ఎంచుకుంటోన్న పాత్రలకు మరీ ఎక్కువ ప్రాధాన్యత కానీ, నటనకు ఆస్కారంగానీ ఉండటం లేదు. దానివల్ల మిగతా వారికంటే ఆమె కాస్త వెనుకబడుతోందనే చెప్పాలి!

మరిన్ని వార్తలు