సౌరబలం (జూలై 21 నుండి 27 వరకు )

20 Jul, 2013 23:49 IST|Sakshi

మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం చివరిలో ప్రయాణాలు. రుణయత్నాలు.

వృషభం (ఏప్రిల్ 21-మే 20)
ఉద్యోగయత్నాలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులు శ్రమకు ఫలితం పొందుతారు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యభంగం.

మిథునం (మే 21-జూన్ 21)
ప్రతిభను చాటుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. వ్యవహారాల్లో విజయం. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం మధ్యలో చికాకులు. ధనవ్యయం.

కర్కాటకం (జూన్ 22-జూలై 23)
పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభకరం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.

సింహం (జూలై 24-ఆగస్టు 23)
నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. వస్తులాభాలు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరవార్తలు. పదవీయోగం. షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు. వారం ప్రారంభంలో పనులు వాయిదా. శ్రమాధిక్యం.

తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బంధువర్గంతో వివాదాలు. ఆస్తుల విషయంలో సోదరులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. నాయకులకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు. వారం చివరిలో ధనలాభం.

వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కార్యక్రమాలు వాయిదా. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడులు. కళాకారులకు అవకాశాలు సంతృప్తినీయవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహన యోగం.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం మధ్యలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.

మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. బంధువుల నుంచి సహాయం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ ఆశయసాధనలో కుటుంబసభ్యుల సహకారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.

మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భూముల కొనుగోలు యత్నాలు. శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు.
సింహంభట్ల సుబ్బారావు

ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 పట్టింది బంగారమే. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశయాలు నెరవేరే సమయం. రావలసిన సొమ్ము అందుతుంది. అవకాశాలు ఇంటి తలుపుతడతాయి. పరిశోధనలు అనుకూలిస్తాయి. వ్యవహారాలు సానుకూలం. గృహ, వాహనయోగాలు. విదేశీ పర్యటనలు. శుభకార్యాల నిర్వహణ. వివాదాల పరిష్కారం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
వరుణ్ సందేశ్
పుట్టినరోజు: జూలై 21

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరం ఫలితం

ఈ సమయంలో హెర్బల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా?

మూసిన తలుపులు

వారఫలాలు

యూఫోరియా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!