చంద్రబింబం మార్చి 16 నుండి 22 వరకు

16 Mar, 2014 02:23 IST|Sakshi
చంద్రబింబం మార్చి 16 నుండి 22 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవితాశయం నెరవేరే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. పారిశ్రామికరంగం వారికి యోగవంతం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

 పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక ప్రకటన నిరుద్యోగులకు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులు ఒత్తిడులకు లోనవుతారు. రాజకీయరంగం వారికి గందరగోళం. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు, ఆహ్వానాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం.


 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు విజయం. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయరంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికరంగం వారికి  అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఇంటాబయటా అనుకూల పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా పుంజుకుంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చే స్తారు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)

 దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)

 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి.  ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. హితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. పదోన్నతులు. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలామణి బాలామణి... అందాల పూబోణి!

డ్రగ్స్‌ వల్ల తలెత్తే అనర్థాలు

ఓ మంచివాడి కథ

దాని శాతం ఎంత ఉండాలి?

పాటల పల్లకీకి కొత్త బోయీలు

దేవదారు శిల్పమా!

కొత్త ఇల్లు

అడవిపువ్వు

అటు అమెరికా ఇటు ఇరాన్‌... మధ్యలో జిన్నీ!

నేను అదృష్టవంతురాలినే: కృతి సనన్‌

ఉత్తమ విలన్స్‌

బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం

సాయి చేసిన మంత్రోపదేశం! 

అతడే వీరేశలింగం..

ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వారఫలాలు

కుడి ఎడమైతే

ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...

మా ఆయన అపరిచితుడు

లైట్‌ హౌస్‌

ద్వారకామాయి

చక్కటి చుక్కలా

బ్యాంకులో ఓ రోజు

దేశ విభజనని శపించిన రాజర్షి

గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?

కరెంట్‌ తీగ

నాకు ఈ యుద్ధం వద్దు బావా!

3ఎస్‌

అత్తమ్మ

జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

హృతిక్‌ చేస్తే కరెక్ట్‌; సునయనది తప్పా!?

బిగ్‌బాస్‌.. అప్పుడే నాగ్‌పై ట్రోలింగ్‌!

‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!