రాశి ఫలాలు ( డిసెంబర్ 28 నుండి జనవరి 3 వరకు )

28 Dec, 2014 01:57 IST|Sakshi
రాశి ఫలాలు ( డిసెంబర్ 28 నుండి జనవరి 3 వరకు )

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యయప్రయాసలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు కొన్ని మార్పులకు సిద్ధపడాలి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో పురోగతి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం.
 
మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశయాలు నెరవేరతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం.  
 
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణయత్నాలు సాగిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2 పా.,)

కొత్తగా రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి అంతగా అనుకూలించదు. ప్రారంభంలో ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.
 
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వ్యవహారాలలో విజయం. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటాబయటా అనుకూలత.  గృహయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి పురస్కారాలు.  వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.  
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు.
 
కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులలో జాప్యం. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యయప్రయాసలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలను కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి, ధనలాభాలు. విందువినోదాలు.
 
మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

దూరప్రాంతాల నుంచి ఆసక్తికరమైన సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  విద్య, ఉద్యోగావకాశాలు. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు. రాజకీయవర్గాలకు సన్మాన, సత్కారాలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు

మరిన్ని వార్తలు