చంద్రబింబం: జూన్ 15 నుండి 21 వరకు

15 Jun, 2014 02:59 IST|Sakshi
చంద్రబింబం: జూన్ 15 నుండి 21 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.  భూవివాదాలు పరిష్కారమవుతాయి.  బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో రుణయత్నాలు. దూరప్రయాణాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం చివరిలో ధన,వస్తులాభాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.  కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా  ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం మధ్యలో  ఇంటాబయటా ఒత్తిడులు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు అసంతృప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఈ వారం మీ సహనానికి పరీక్షా సమయమే. బంధువులు, మిత్రులతో వివాదాలు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాల వారు కొంత నిరాశ చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. సోదరులతో వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి. వారం చివరిలో అనారోగ్యం. ఆటంకాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

మరిన్ని వార్తలు