సౌరబలం: సెప్టెంబర్1 నుండి 7 వరకు

1 Sep, 2013 00:12 IST|Sakshi
సౌరబలం: సెప్టెంబర్1 నుండి 7 వరకు

మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు.
 
 వృషభం (ఏప్రిల్ 21-మే 20)
 ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశ కలిగిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 మిథునం (మే 21-జూన్ 21)
 ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. ఆశయాలు నెరవేరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ప్రయాణాలు.
 
 కర్కాటకం (జూన్ 22-జూలై 23)
 వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. వాహనయోగం. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు.
 
 సింహం (జూలై 24-ఆగస్టు 23)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
 రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
 ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.

 వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
 కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. రుణయత్నాలు విరమిస్తారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది.
 
 ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
 కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూవివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఇంటి నిర్మాణయత్నాలు పునఃప్రారంభించే అవకాశం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
 
 మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. భవిష్యత్ అంచనాలు రూపొందిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 
 కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
 ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. భూ, గృహయోగాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. వివాదాలు.
 
 మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
 బంధువుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది.  కోర్టు వ్యవహారాలలో అనుకూలత. వివాహ యత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ ఆశయ సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. మనోవేదన తొలగుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. ఉపాధి యత్నాలు సానుకూలమౌతాయి. కళాకారులకు అవకాశాలు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. గృహ, వాహనయోగాలు. ఏడాది ద్వితీయార్థంలో వివాదాలు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు.
 - పవన్ కల్యాణ్
 పుట్టినరోజు: సెప్టెంబర్ 2
 - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు