సౌరబలం: సెప్టెంబర్22 నుండి 28వరకు

22 Sep, 2013 01:33 IST|Sakshi
సౌరబలం: సెప్టెంబర్22 నుండి 28వరకు

మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
 ఆర్థికంగా బలం చేకూరుతుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం.
 
 వృషభం (ఏప్రిల్ 21-మే 20)
 పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు.
 
 మిథునం (మే 21-జూన్ 21)
 పలుకుబడి పెరుగుతుంది. పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 కర్కాటకం (జూన్ 22-జూలై 23)
 శ్రమ ఫలిస్తుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి విషయంలో సోదరులతో అగ్రిమెంట్లు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు.
 
 సింహం (జూలై 24-ఆగస్టు 23)
 నూతన వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు.
 
 కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
 చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
 
 తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యల నుంచి బయటపడే సమయం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు అనుకూలమైన ప్రకటన రావచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
 కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. గతంలో నిలిచిపోయిన వ్యవహారం సైతం పూర్తి కాగలదు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
 
 ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చికాకులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ఆస్తుల విషయంలో సోదరులతో ఒప్పందాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.
 
 మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
 ప్రారంభంలో కొంత నిరాశ కలిగినా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. భూ, గృహయోగాలు కలిగే సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం.
 
 కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
 పనులు అనుకున్నట్లే పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.
 
 మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రతికూలత. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 లతామంగేష్కర్
 పుట్టినరోజు: సెప్టెంబర్ 28
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 గురుబలం అండగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు కొంత శ్రమతో పూర్తి కాగలవు. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మీ నైపుణ్యానికి గుర్తింపు రాగలదు. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద విజయావకాశాలు ఎక్కువనే చెప్పాలి.

మరిన్ని వార్తలు