బాబు, రాజన్నపాలనలో... వ్యవసాయం

4 May, 2014 00:22 IST|Sakshi
బాబు, రాజన్నపాలనలో... వ్యవసాయం

అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఒకే విధానం... వ్యవసాయం ఓ దండగమారి పని అన్నదే నినాదం! ఉన్నంత కాలం ఆ విధంగానే ముందుకు పోయారు. అందుకే ఆయన పేరు చెబితే సగటు రైతు ఇప్పటికీ కలవరంతో ఉలిక్కిపడతాడు. ఆయనే చంద్రబాబు! ఇదే ఆయన పాలన..!
 
 
రాష్ట్రంలో ఎటుచూసినా మరణమృదంగమే ఆనాడు! 

 చంద్రబాబు పాలనలో వ్యవసాయం ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని చూసింది. రైతులపై కక్షగట్టినట్లు వ్యవహరించారు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్నారు... నష్టాలు వస్తున్నాయంటే మానేయమన్నారు. రైతును చీదరించుకున్నారు... సన్నచిన్నకారు రైతులు భూములు అమ్ముకుని కూలీలుగా మారిపోయారు. కరవు వలసలు, ఆకలి చావులు.. ఆత్మహత్యలు... ఆంధ్రరాష్ట్రంలో ఎటు చూసినా మరణ మృదంగమే ఆనాడు!
 
పరిహారం కోసమే ఆత్మహత్యలన్నాడు..!

బహుళజాతి కంపెనీ అయిన మోన్‌శాంటో కంపెనీతో కుమ్మక్కయిన బాబు రాష్ట్రంలోని పత్తి రైతులకు విత్తనాలు అందకుండా చేశారు. తెగుళ్లను తట్టుకుంటాయని చెబుతూ ఆ కంపెనీ ఒక్కో బీటీ విత్తనాల ప్యాకెట్‌ను రైతులకు రూ.1850కి అంటగట్టేది. సాగును సంక్షోభంలోకి నెట్టిన అపరాధ భావం ఏ కోశాన లేని చంద్రబాబు రైతులపై వ్యతిరేకతను ఎక్కడా ఆపుకోలేదు. రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణం సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు రాకపోవడం, దానివల్ల అప్పులు పెరిగిపోవడమేనని తెలిసినా... వారికి కనీస సహాయం అందించకపోగా  పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కారుకూతలు కూసిన బాబు మాటలు రైతులింకా మరచిపోలేదు!
  
అన్నం పెట్టే చేతికి సంకెళ్లు

 అందరికీ అన్నం పెట్టే రైతు చేతులకే సంకెళ్ళు వేయించిన ఘనుడు బాబు! అప్పు కట్టకపోతే పొలంలో మోటారు పీక్కెళ్ళారు. ఇంటి తలుపులు లాక్కెళ్ళారు, రైతుల ఉసురు తీశారు. బిల్లులు చెల్లించని రైతులపై ఏకంగా దొంగతనం కేసులు నమోదు చేయించారు. బేడీలు వేయించి జైలుకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు. కరువుసీమ అయిన ఒక్క అనంతపురం జిల్లాలోనే పాతిక వేల మంది అన్నదాతలపై కేసులు పెట్టారు!

మద్దతు ధర ఊసెత్తితే ఒట్టు!

 చంద్రబాబు తన పాలనలో ఏ పంటకూ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. ఫలితంగా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో వరి కనీస మద్దతు ధర రూ.50 మాత్రమే పెరిగింది. 2004లో వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 590 ఉండేది. ఇక పప్పుధాన్యాలు, పత్తి తదితర పంటల పరిస్థితైతేమరీ దారుణం!
 
రైతులకు కరెంటు షాక్!

వ్యవసాయం దండగనే సిద్ధాంతాన్ని నమ్మిన బాబు అధికారంలో ఉన్న ఆఖరి ఏడాది (2004) బడ్జెట్‌లో వ్యవసాయానికి కేవలం రూ. 214 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.5014 కోట్లు మాత్రమే విదిల్చారు. 1995లో రూ.150 ఉన్న 3 హార్స్ పవర్(హెచ్‌పీ) కరెంటు చార్జీలను పాలనా కాలం ముగిసేసరికి ఏకంగా రూ.825కు పెంచారు!
 
ఇవన్నీ చాలవన్నట్టుగా...

  వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని, అందుకే భారాన్ని రైతులు భరించవలసిందేనని ముఖ్యమంత్రి హోదాలో బాబు ఆనాడు పార్టీ నేతల సమావేశాల్లో స్పష్టంగా ప్రకటించా రు. అంతేకాదు, ‘మనసులో మాట’ పుస్తకంలో ‘అసలు సబ్సిడీ అనేది పులి మీద స్వారీ చేయడం లాంటిది’ అని కూడా ఆయన సెలవిచ్చారు!

  బాబు పాలనంతా కరువుకాలమే. అతివృష్టి, అనావృష్టి రైతులను అతలాకుతలం చేశాయి. ఏ పంట వేసినా అప్పులు, తిప్పలే ఎదురుకావడంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... గ్రాసం దొరకని స్థితిలో పశువులు కూడా బక్కచిక్కిపోయాయి.కంప్యూటరే సర్వస్వమని నమ్మిన హైటెక్ బాబు వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన  హయాంలో పంట రుణాలపై 14శాతం వడ్డీరేటు ఉండేది. దీనిపై మళ్లీ రెండుశాతం స్టాంపు డ్యూటీ కూడా ఉండేది. దిక్కు తోచని రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు.
 
బాబు రైతు రుణమాఫీ హామీ వట్టి బూటకం...
 
 ఎస్‌ఎల్‌బీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రైతుల రుణాలు రూ.1.27లక్షల కోట్లు. ఇవి కాక బాబు మాఫీ చేస్తానన్న డ్వాక్రా రుణాలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తం రూ 1.47 లక్షల కోట్లు. కానీ  రాష్ట్ర రెవెన్యూ మాత్రం రూ.1.25 లక్షల కోట్లే. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు అన్నీ మానేసినా ఈ రెండు మాఫీలూ చేయడం అసాధ్యం. ఎలా మాఫీ చేస్తారని ఎన్నికల సంఘం అడిగితే బాబు వద్ద జవాబు లేదు.
 
 
రాజన్న రాజ్యం 
 
 వ్యవసాయానికి, పల్లెలలకు ఊపిరినిచ్చి అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపారు కాబట్టే వైయస్సార్ రాజ్యంలో వ్యవసాయ వృద్ధిరేటు 6.14 శాతానికి చేరుకుంది. ఇది చంద్రబాబు పాలనలో 3.84 శాతం మాత్రమే!బడ్జెట్‌లో వ్యవసాయానికి చంద్రబాబు 2.46 శాతం నిధులు కేటాయిస్తే, వైయస్సార్ 4.62 శాతం నిధులు కేటాయించారు! చంద్రబాబు నిర్లక్ష్య నిరంకుశ పాలన ఫలితంగా, ముందు చూపులేని విధానాల వల్ల 2002-03లో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులకే పరిమితమైంది. వైయస్సార్ వ్యవసాయాన్ని కన్నబిడ్డలా సాకడంతో 2008-09లో ఆహారధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులకు చేరింది! ఉత్పత్తి రెట్టింపు అయిందంటే రైతుల ఆదాయాలు పెరిగినట్టేగా!

ఉచిత విద్యుత్, విద్యుత్  బకాయిల రద్దు, మద్దతు ధరలు, విత్తనాలు, ఎరువుల ధరలపై నియంత్రణ. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి.... ఇలా అన్నదాతకు సంబంధమున్న ఏ విషయాన్నీ వైయస్సార్ నిర్లక్ష్యం చేయలేదు. వైయస్సార్ పాలన భేషుగ్గా ఉందని, వ్యవసాయానికి ఆయన చేస్తున్న సాయం ఉన్నతంగా ఉందని, అదే పద్ధతిలో నడుచుకోమని ఓ దశలో చంద్రబాబుకు ఆయన చిన్నాయన నారా కృష్ణమనాయుడు సలహా ఇచ్చారు.
 
రెతన్న కోసం జగనన్న సంకల్పం...

 గిట్టుబాటు ధర  కోసం స్థిరీకరణ నిధిదిగుబడి, గిట్టుబాటు ధరలను సమతుల్యం చేసేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
 
 రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి

{పకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు తక్షణం అంచనాల వేసి, వీలైనంత త్వరగా రైతులకు పరిహారం చెల్లించడం దీని లక్ష్యం
 రెండో పంట వేసే నాటికే రైతు చేతికి పరిహారం అందేలా చూస్తాం
 
 వడ్డీలేని రుణాలు
      
రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తాం యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై రైతులకు సబ్సిడీలిస్తాం
 
రుణ మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి
  
వరదలు, తుపాన్లు; కరవు కాటకాలతో రైతులు అల్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందున సరికొత్త రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఒత్తిడి తెస్తుంది
 
ఇద్దరు వ్యవసాయ మంత్రులు

వ్యవసాయ రంగానికి ఇద్దరు మంత్రులను నియమిస్తాంఒకరు వ్యవసాయ ఉత్పత్తులను పర్యవేక్షిస్తారుమరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతాం
 
 ఆరు నూరైనా ఉచిత విద్యుత్
     
వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ను ఆరు నూరైనా అందిస్తాం. ఇందులో 7 గంటల పాటు పగలే నిరంతరాయంగా ఇస్తాం, ఎంత ఖర్చయినా భరిస్తాం
 
మూడు వ్యవసాయ వర్సిటీలు

వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది {పతి రెండు జిల్లాలకూ ఒక వ్యవసాయ డిగ్రీ కళాశాల పంటలను బట్టి రెండు జిల్లాలకో వ్యవసాయ పరిశోధన కేంద్రం పురుగు మందుల నాణ్యత, పర్యవేక్షణ బాధ్యతలు ఈ పరిశోధన కేంద్రాలకే
 
102 సేవలు
 
భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం దీని లక్ష్యం .రైతులు 102 నంబర్‌కు ఫోన్ చేయగానే వారి పొలాల వద్దకే వాహనాలొచ్చి నమూనాలు  సేకరిస్తాయి.
 
103 సేవలు
     
103 నంబర్‌కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లోనే సంచార పశువైద్యశాల రైతు ముందే ప్రత్యక్షమవుతుంది.అవసరమైన వైద్య సేవలను అప్పటికప్పుడే అందిస్తారు. అంతేగాక మండలానికో పశు వైద్యశాల ఏర్పాటు చేస్తాం
 

మరిన్ని వార్తలు