బాబు, రాజన్నపాలనలో... పింఛన్లు

4 May, 2014 01:39 IST|Sakshi
బాబు, రాజన్నపాలనలో... పింఛన్లు

 పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం! వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత.  పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా, దానివల్ల అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ  వైఎస్ వచ్చే వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి.
 
 బాబు పాలన
     
చంద్రబాబు హయాంలో అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. 2004లో పదవి నుంచి దిగిపోయే నాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు.

రాజన్న రాజ్యం
     
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు.2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ. వంద నుంచి రూ. 200కు పెంచారు.2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. {పతి నెలా జీతంలా పెన్షన్లు ఇచ్చారు.
 
 జగన్ సంకల్పం
 
 అన్నం కోసం వృద్ధులు కూలి పని చేయకూడదు. ప్రతి అవ్వకు, తాతకు నెలకు రూ.700 పింఛను, వితంతువులకు నెలకు రూ.700, వికలాంగులకు నెలకు రూ.1000 ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు ఆశ్రమాలు స్థాపిస్తాం. వాటిని మండలస్థాయికి విస్తరిస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే రెండో సంతకం ఇదే! అవ్వాతాతలకు ఇది ఒక మనవడి మాట.

మరిన్ని వార్తలు