కళ్లకు కళాకాంతులు

15 Sep, 2019 11:15 IST|Sakshi

బ్యూటీజర్‌

ఆడవాళ్లకైనా.. మగవాళ్లకైనా మూడుపదులు దాటాయంటే.. ముఖం మీద ముడతలు మొదలయిపోతాయి. మొదట కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు బయటపడుతుంటాయి. అందుకే.. ‘అందం చందం అంటే..  ఇరవై నుంచి ముప్ఫై వరకే’ అనేది అనాదిగా నమ్మే నానుడి. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు. మెయిన్‌టెనెన్స్‌ ఉంటే చాలు. అరవైలోనూ స్వీట్‌ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చనేది టెక్నాలజీ మాట.

కళ్లకింద ముడతలు, వయసు తెలిపే నల్లటి చారలు కనిపించకుండా పౌండేషన్‌ క్రీమ్స్, ఐలైన్, మస్కారా, ఐబ్రో పెన్సిల్‌ ఇలా కళ్లని హైలైట్‌ చేసే మేకప్‌ వేసి కవర్‌ చేస్తుంటారు చాలా మంది. కానీ వాటికంటే ముందు కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు పోయేలా చిత్రంలోని మెషిన్‌ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కళ్ల కింద వచ్చిన మచ్చలను పోగొట్టడంతో పాటూ వయసుతో వచ్చే చారలను కూడా మటుమాయం చేసేస్తుంది. దీన్ని రోజుకు మూడు నిమిషాలు పెట్టుకుంటే చాలు. కళ్ల కింద చర్మం మెరుగవుతుంది. ఇది పెట్టుకోగానే కంపనాలు వస్తూ వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి  హార్డ్‌ లేదా సాప్ట్‌ అని రెండు మూడ్స్‌ ఉంటాయి.

హార్ట్‌ మూడ్‌ ఆన్‌ చేసుకుంటే విద్యుత్‌ ప్రకంపనాలు వేగం పెరిగి ఫలితం త్వరగా ఉంటుంది. పింక్‌ కలర్‌లో ఉన్న పైభాగంతో పాటూ నాలుగు వైట్‌ ప్యాడ్స్, రెండు బ్యాటరీలు ఈ ప్రొడక్ట్‌ని కొనుగోలు చేసినప్పుడే లభిస్తాయి. రెండు వైపు ప్యాడ్స్‌ కలిపి ఉంచేందుకు చిన్న ఎలాస్టి్టక్‌ ఉంటుంది. అది ముక్కు మీద నుంచి పట్టి ఉంచుతుంది. దీన్ని ‘ఐ స్లాక్‌ హరుకా’ అని పిలుస్తారు. మార్కెట్‌ ధరల ప్రకారం సుమారుగా 82 డాలర్ల (5,895 రూపాయలు) కు ఇది అమ్ముడుపోతుంది. జపాన్‌లో రూపొందిన ఈ బ్యూటీ గాడ్జెట్‌ వయసు తెలియని అందాన్ని నిమిషాల్లో చేయనుంది. భలే ఉంది కదూ!

>
మరిన్ని వార్తలు