మెరిసే చర్మం

7 Jan, 2018 00:39 IST|Sakshi

ఎంత కలర్‌గా ఉన్నా... ఎంత అందంగా ఉన్నా.. శీతాకాలం వస్తే చాలు చర్మం మెరుపును కోల్పోయి.. పొట్లుపోతుంది. తెల్లతెల్లని మచ్చలతో చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాంటి సమస్యలు దూరం కావాలంటే సహజసిద్ధమైన ఫేస్‌ ప్యాక్స్‌ అప్లై చేసుకోవాల్సిందే. వాటివల్లే అందం మరింత రెట్టింపు కావడంతో పాటూ చర్మ సంరక్షణ సాధ్యమవుతుంది. మరైతే ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావలసినవి: బాదం – 5 లేదా 6 (వాటర్‌లో నానబెట్టినవి) ఓట్స్‌ – 1 టేబుల్‌ స్పూన్, పెరుగు – 2 టీ స్పూన్స్‌ తేనె – అర టీ స్పూన్‌
తయారీ : ముందుగా బాదం ఒక బౌల్‌లోకి వేసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో ఓట్స్, పెరుగు, తేనె యాడ్‌ చేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖం క్లీన్‌ చేసుకుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. తరువాత 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు