సౌందర్యపు బొమ్మ

18 Nov, 2018 01:37 IST|Sakshi

న్యూ ఫేస్‌ 

మగువలు సినీతారల్లా మెరిసేందుకు ఈ మధ్యకాలంలో ఎన్నో క్రీమ్స్‌ పోటెత్తుతున్నాయి. కానీ ఆ మెరుపు కొన్ని గంటలు మాత్రమే నిలుస్తుంది. మేకప్‌ ఉన్నా లేకపోయినా ముఖం కాంతివంతంగా మెరవాలంటే... ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఈ పద్ధతులు ఆచరించాల్సిందే. అప్పుడే సౌందర్యపు బొమ్మలా మెరిసిపోతారు. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోండి. సౌందర్యపు బొమ్మ

కావల్సినవి : క్లీనప్‌ : క్యారెట్‌ జ్యూస్‌ – 2 టీ స్పూన్స్, మీగడ – 1 టీ స్పూన్‌

స్క్రబ్‌ : ముల్తానీ మట్టి – అర టీ స్పూన్, ఓట్స్‌ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్‌ మాస్క్‌ : ద్రాక్ష గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్స్, పచ్చి పసుపు – 1 టీ స్పూన్‌ స్పూన్, చిక్కటి పాలు – అర టీ స్పూన్‌

తయారీ : ముందుగా ఒక బౌల్‌ తీసుకుని క్యారెట్‌ జ్యూస్, పెరుగు మీగడ యాడ్‌ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు ముల్తానీ మట్టి, ఓట్స్, తేనె, గడ్డ పెరుగు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్‌ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష గుజ్జు, పచ్చి పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 లేదా 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు