తారలా మెరవొచ్చు

4 Aug, 2019 13:02 IST|Sakshi

న్యూ ఫేస్‌

ఒకప్పుడు ముఖసౌందర్యానికి సహజసిద్ధమైన లేపనాలనే వాడేవారంతా. కానీ మార్కెట్‌లో పోటెత్తుతున్న లోషన్స్, క్రీమ్స్‌ వాడటం వల్ల.. మరింత మెరుపు రావడంతో వంటింటి చిట్కాలను పక్కనపెట్టి మరీ.. మార్కెట్‌ ప్రొడక్స్‌నే నమ్ముకుంటున్నారు. కానీ వందలు పోసి కెమికల్స్‌ మిళితమైన బ్యూటీ ప్రొడక్స్‌ కొనేకంటే.. ఖర్చు లేని లేపనాలే చర్మకాంతికి ఔషదాలంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి.

కావల్సినవి: క్లీనప్‌ : బాదం పాలు – 1 టీ స్పూన్, తేనె – 1 టీ స్పూన్‌
స్క్రబ్‌ : కమలా తొక్కల పొడి – 1 టీ స్పూన్, అరటి పండు గుజ్జు – 2 టీ స్పూన్లు
మాస్క్‌:  పాల మీగడ – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, క్యారెట్‌ గుజ్జు – 2 టీ స్పూన్లు

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని బాదం పాలు, తేనె వేసుకుని బాగా కలుపుకుని.. ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు కమలా తొక్కల పొడి, అరటిపండు గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు పాల మీగడ, శనగపిండి, క్యారెట్‌ గుజ్జు కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు