తేనెటీగ విషం... ఆ బాధకు విరుగుడు

30 Oct, 2016 15:47 IST|Sakshi
తేనెటీగ విషం... ఆ బాధకు విరుగుడు

విషాన్ని తగువిధంగా ఉపయోగిస్తే అది ఔషధం అవుతుందన్న విషయం మరోమారు రుజువైంది. ఇది పూర్తిగా నిర్ధారణ జరిగి, మనుషులకు అందుబాటులోకి వస్తే కోట్లాది ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఆర్థరైటిస్‌తో బాధపడే అనేక మందికి నిజంగా శుభవార్తే.
 
 తేనెటీగ కుట్టినప్పుడు అది వెలువరించే విషపదార్థాలు ఆర్థరైటిస్‌ను తగ్గిస్తాయని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు. ఆ విషంలోని పెప్టైడ్ వల్ల ఇది సాధ్యపడుతుందంటున్నారు వారు. ఈ పెప్టైడ్‌లో ‘మెలిటిన్’ అనే పదార్థం ఉంటుంది. అది కీళ్ల మధ్య షాక్ అబ్జార్బర్‌గా పనిచేయడంతో పాటు... ఎముక చివరన ఉండే ‘మృదులాస్థి’ శిథిలం కాకుండా కాపాడుతుందట.
 
  ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగాలు చేసి, ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు నిపుణులు. ఇంకా మానవుల్లో ఈ ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇది కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మాత్రమే గాక... ఆటల్లో, ప్రమాదాల్లో గాయపడేవారికీ మేలు చేకూరుస్తుందంటున్నారు పరిశోధకులు.

మరిన్ని వార్తలు