బికినీ అంటే ఒక దీవి!

1 Feb, 2015 13:55 IST|Sakshi
బికినీ అంటే ఒక దీవి!

పేరు వెనుక...
శరీరానికి సూర్యరశ్మి తగలడానికి వీలుగా ఆడవాళ్ల కోసం రూపొందించిన ఈతదుస్తులే... బికినీ! యూరోపియన్ దేశాల్లో 1940ల తర్వాత వీటి వినియోగం విస్తృతం అయ్యింది. దీన్ని మొదట ధరించింది ఫ్రెంచ్ మహిళామణులు. ఫ్రాన్స్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ జాక్వెస్ హీమ్ తొలుత టూ పీస్ ‘ఆటోమ్’ రూపొందించాడు. దాన్ని అత్యంత చిన్న బాతింగ్ సూట్‌గా ప్రచారం చేశాడు.అయితే, 1946లో అమెరికా అణుపరీక్ష నిర్వహించింది.

 పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి ‘బికినీ అటాల్’(కొబ్బరికాయల దీవి అని అర్థం) వేదికగా ఆ పరీక్ష జరగడంతో బికినీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇదే అదనుగా మరో ఫ్రెంచ్ డిజైనర్ లూయిస్ రీడ్ మరింత చిన్నవైన ఈతవస్త్రాలను రూపొందించి వాటికి ‘బికినీ’ అని నామకరణం చేశాడు. బికినీ అటాల్ చిన్నదే, తను రూపొందించిన వస్త్రం కూడా చిన్నదే, కాబట్టి ఆ పేరుతో వ్యవహరించడం బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడు లూయిస్.

మరిన్ని వార్తలు