బబుల్ బన్

18 Sep, 2016 01:27 IST|Sakshi
బబుల్ బన్

సిగ సింగారం
షార్ట్ హెయిర్ గలవారు కేశాలంకరణలో ఎన్నో రకాల స్టైల్స్‌తో వెలిగిపోవచ్చు. పార్టీకి వెస్టర్న్ వేర్ ధరించినప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది అని ఆందోళన చెందకుండా సింపుల్‌గా అనిపించడంతో పాటు సౌకర్యంగానూ  సౌకర్యంగానూ, స్టైల్‌గానూ ఉండే ఈ బబుల్‌బన్‌ని ట్రై చేయవచ్చు. ఈ కేశాలంకరణను కేవలం 2 నిమిషాలలోనే చేసుకోవచ్చు.
 
1. జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. పోనీటెయిల్‌లా జుట్టునంతా నడినెత్తిమీదకు దువ్వి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి.
 
2. రబ్బరు బ్యాండ్  పెట్టిన జుట్టు కొంత పైకి పెట్టి, మరో వరుస అదే రబ్బరు బ్యాండ్ వేయాలి.
 
3. ఫొటోలో చూపిన విధంగా కొంత కుచ్చు వచ్చేలా జుట్టును, రబ్బర్‌బ్యాండ్‌ను సెట్ చేసుకోవాలి.
 
4. రబ్బర్ బ్యాండ్ చుట్టూతా కింద మిగిలిన జుట్టును మడచి తిప్పాలి.
 
5. జుట్టు చివరలను మడ వాలి. రబ్బర్‌బ్యాండ్ పెట్టిన దగ్గర కొద్దిగా వదులు చేసిన మధ్య నుంచి జుట్టు చివరలను బయటకు తీయాలి.
 
6. పైన బన్ ఒక పువ్వు గుత్తిలా చేత్తోనే సెట్ చేయాలి.
 
7. జుట్టు చివరలను నీటుగా సర్ది, మడవాలి.
 
8. బయటకు రాకుండా జుట్టుకు దగ్గరగా చివరలను క్లిప్‌తో సెట్ట చేయాలి.
 
9. ఫొటోలో చూపిన విధంగా నడి నెత్తి మీద అందమైన బుడగలాంటి అలంకరణ ముచ్చట గొలుపుతుంది.
 
సహజమైన కండిషనర్
దుమ్ము, పొగ.. వంటివి శిరోజాలను త్వరగా పొడిబారేలా చేస్తున్నాయి. పొడిగా మారిన వెంట్రుకల చివర్లు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం..
* బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసి, దాంట్లో గుడ్డు సొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కురులకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.
* పావు కప్పు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీటిలో కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ నీటితో వెంట్రుకలను తడపాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషన్‌ని ఇస్తుంది.
* షాంపూ చేసిన తర్వాత బేకింగ్ సోడాలో అతి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలను తడిపి, ఆ తర్వాత కడిగేయాలి.

మరిన్ని వార్తలు