గుండెపోటును పెంచే క్యాన్సర్!

12 Dec, 2016 14:27 IST|Sakshi
గుండెపోటును పెంచే క్యాన్సర్!

క్యాన్సర్ కేవలం ఆ జబ్బు వల్ల వచ్చే అనర్థాలకు మాత్రమే పరిమితమవుతుందని అనుకోకూడదు. దానివల్ల గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధనల ఫలితాల వల్ల తెలిసిందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం క్యాన్సర్ జబ్బుకు గురైన వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహా గుండె జబ్బును ‘స్టెమీ’ అంటారు. అంటే... ఎస్‌టీ- ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్.
 
  క్యాన్సర్ వచ్చి నయమయ్యాక కూడా కూడా ఈ దుష్ర్పభావం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా క్యాన్సర్ వచ్చి పూర్తిగా నయమైన ప్రతి 10 మందిలో ఒకరికి ‘స్టెమీ’ వచ్చే అవకాశం ఉందట. ‘‘అందుకే పూర్తిగా క్యాన్సర్ నయమయ్యాక కూడా అది తగ్గిపోయింది కదా. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించడం కుదరదు. ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి విధానాలను అనుసరిస్తూండటం అవసరం’’ అంటున్నారు జియోర్గ్ హెర్మన్.
 

మరిన్ని వార్తలు