అమెరికా అమ్మాయి అదుర్స్!

13 Mar, 2016 00:34 IST|Sakshi
అమెరికా అమ్మాయి అదుర్స్!

అప్పుడెప్పుడో వచ్చిన ‘అమెరికా అమ్మాయి’ సినిమా మనవాళ్లకి చాలా నచ్చేసింది. ఓ విదేశీయురాలు మన దేశానికి వచ్చి, మన సంస్కృతిని మెచ్చి ఫాలో అవడం చూసి గర్వంగా ఫీలయ్యాడు ప్రతి తెలుగు ప్రేక్షకుడూ. ఇప్పుడు అదే పేరుతో ఓ సీరియల్ వస్తోంది. అయితే కథ అలా ఉండదు. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘ముద్దుల మనవరాలు’ టైపులో ఉంటుంది. ఆ సినిమాల్లో హీరోయిన్ విదేశీయురాలు కాదు. మన దేశానికే చెందిన దంపతులకు పుట్టి, అమెరికాలో పెరిగిన అమ్మాయి. ఈ సీరియల్‌లో కూడా అంతే.

హీరోయిన్ అమెరికాలో పుడుతుంది. అనుకోని కారణాల వల్ల మన దేశానికి వస్తుంది. తనకు అంతగా దగ్గర కాని తనవాళ్ల దగ్గర ఉండాల్సి వస్తుంది. అక్కడ్నుంచి ఆమెకు ఎదురయ్యే అనుభవాలు, ఆమె చుట్టూ అల్లుకునే అనుబంధాలతో కథ ఆసక్తిగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటి పెద్దగా తాళ్లూరి రామేశ్వరి కనిపించడం పెద్ద ఎసెట్!

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు