సఫారీలో సహాయకారి

18 Jan, 2015 01:10 IST|Sakshi
సఫారీలో సహాయకారి

ప్లే టైమ్
కుందేలును పోలిన చెవులు, కంగారూను పోలిన తోక, ముంగీస వంటి రూపం, పందిని పోలిన మూతి... ఇన్ని పోలికలున్నా దీనికి వాటితో ఎలాంటి సంబంధమూ లేదు. దీని పేరు అర్ద్‌వర్క్. ఈ పేరు ఆఫ్రికాలోని గిరిజనుల భాష నుంచి వచ్చింది. సఫారీల్లో, ఆఫ్రికన్ ఎడారి ప్రాంతాల్లో కీటకాలు, చీమలను తింటూ బతుకుతుంది అర్ద్‌వర్క్. తీవ్రమైన వేడిమిని తట్టుకొనే శక్తి ఉంటుంది దీనికి. బలమైన పళ్లు, పొడవాటి నాలుక అర్ద్‌వర్క్‌కు ఉన్న ప్రత్యేకతలు. తన పళ్లతో నేలను తవ్వుతూ, పొడవాటి నాలుకతో చీమలనూ, చెదను పడుతూ ఆహారాన్ని సంపాదించుకొంటుంది.

సఫారీల్లో దీనికి సింహాలు, హైనాలు, పైథాన్‌ల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. చిక్కాయంటే అర్ద్‌వర్క్‌లు వాటికి ఆహారం అయిపోతుంటాయి. అనువైన స్థానంలో గుంతలు తవ్వి, వాటిని నివాసానికి తగువిధంగా తీర్చిదిద్దుకొనే అర్ద్‌వర్క్‌లకు వలసవెళ్లే గుణం ఉంటుంది. అటువంటి సమయంలో ఇవి తవ్విన కందకాలు ఇతర చిన్న చిన్నజంతువులకు ఆవాసంగా ఉపయోగపడతాయి. అందుకే అర్ద్‌వర్క్‌లను ఇతర జంతువులకు సహాయకారులని అంటారు.

మరిన్ని వార్తలు