వర్ణం: దేశం, వేడుక వేరు... అలంకరణ ఒక్కటే!

19 Jan, 2014 05:26 IST|Sakshi
వర్ణం: దేశం, వేడుక వేరు... అలంకరణ ఒక్కటే!

మన వద్ద జట్కాలు వేరు, ఎద్దుల బళ్లు వేరు. ఈ రొమేనియా వ్యక్తిని చూడండి... ఎద్దుల బండిని గుర్రంతో లాగించేస్తున్నాడు. వారి బండి ఇదే. రొమేనియాలో ఇప్పటికీ గుర్రాలను రవాణాకు, వ్యవసాయంలో విరివిగా వాడతారు. ఈ చిత్రం... అక్కడ జరిగే ఉత్సవంలోనిది. వేడుకల్లో గుర్రాలను ఇలా అందంగా అలంకరిస్తారు. పక్కన ఇంకో గుర్రాన్ని చూశారా... దాని తోకకు జడ వేసి, రిబ్బను కూడా కట్టారు! ఈ ఉత్సవం అక్కడ ఒక సంప్రదాయం... చివర్లో ఈ గుర్రాలకు పవిత్ర జలంతో స్నానం చేయించడంతో వాటికి దీవెనలు అందుతాయని నమ్మకం.
 
 ఈ మొక్కకు ప్రేయర్ తెలుసు..
 అందంగా ఉన్న ఈ మొక్కను చూశారా. ఇది ఇళ్లలో పెంచుకోవడానికి ఒక మంచి మొక్క అట. పగలంతా విశాలంగా ఉండే ఈ మొక్క ఆకులు సాయంత్రం కాగానే మనం దేవుడిని నమస్కరించేటపుడు చేతులు ఎలా పెడతామో అలా మారిపోతాయి. అందుకే దీనికి ప్రేయర్ ప్లాంట్ అని పేరొచ్చింది. బ్రెజిల్‌లోని దట్టమైన రెయిన్ ఫారెస్ట్‌లో పెరిగే మొక్క కావడం వల్ల ఇంట్లో ఎండ తగలని చోట పెట్టినా ఈ మొక్క బతుకుతుంది. మొక్కలకు ప్రాణంతో పాటు భక్తి కూడా ఉందా ఏంటి?!
 
 భద్రత.. శ్రద్ధ...
 ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో జపాన్ ప్రభుత్వం తన ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఫిట్‌నెస్‌ను చెక్ చేస్తుందట. అందులో ఇలాంటి విన్యాసాలు బోలెడు. ప్రభుత్వ అగ్నిమాపక శాఖ, ఎడో ఫైర్‌మెన్‌షిప్ అసోషియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సిబ్బంది చేసిన విన్యాసాల నుంచి తీసిన ఓ దృశ్యం ఇది.

మరిన్ని వార్తలు