గుట్టు

22 Jul, 2017 23:28 IST|Sakshi
గుట్టు

ప్రొఫెసర్‌ కోటేశ్వర్రావు గుండెపోటుతో చనిపోయాడు. డెబ్బై సంవత్సరాలు దాటిన కోటేశ్వర్రావు వివాదరహితుడు. అలాంటి కోటేశ్వర్రావు రెండు సంవత్సరాల నుంచి చాలామందికి శత్రువయ్యాడు.రెండు సంవత్సరాల క్రితం కోటేశ్వర్రావు  సమీప బంధువు రాజు హత్యకు గురయ్యాడు. ఒకరోజు రాత్రి కోటేశ్వర్రావు, రాజులు బార్‌కు వెళ్లివస్తుండగా ఎటాక్‌ జరిగింది.

 కోటేశ్వర్రావు కళ్ల ముందే హత్య జరిగింది.‘‘చంపింది ఎవరో నాకు తెలుసు’’ అని మొదట చెప్పిన మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ ఆ తరువాత మాట మార్చాడు.‘‘చంపిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ముఖానికి మాస్క్‌ వేసుకొని  ఉన్నాడు’’ అని చెప్పి తప్పించుకున్నాడు.‘చంపిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు!’ అని సన్నిహితుల దగ్గర చెప్పిన వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు మాట మార్చాడు?
∙∙
రెండు సంవత్సరాలుగా పోలీసులు  రాజు హత్య గురించి దర్యాప్తు చేస్తున్నారు. అయినా హంతకుడిని పట్టుకోలేక పోయారు. కోటేశ్వర్రావు గుండె పోటుతో చనిపోవడంతో...‘‘తాను చనిపోవడంతో పాటు... రహస్యాన్ని కూడా చంపేశాడు’’ అని విసుక్కున్నారు పోలీసులు.

ఈ సమయంలోనే వారికి కొత్త విషయం ఒకటి తెలిసింది. ‘రకరకాల విషయాలతో పాటు... ఎంత పెద్ద రహస్యమైనా సరే... డైరీలో రాసే అలవాటు కోటేశ్వర్రావుకు ఉంది’ అని! ఆ డైరీని కనిపెడితే ఆరోజు జరిగింది  ఏమిటో, హంతకుడు ఎవరో కనిపెట్టవచ్చు అనుకున్నారు పోలీసులు.

ఆ డైరీ సెఫ్టీలాకర్‌లో ఉంది. దాని నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ ఇంట్లో ఎవరికీ తెలియదు. ‘‘ఒకసారి ఈ  పాస్‌వర్డ్‌ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... ఛిఠి అంటూ ఏదో చెప్పారు’’ అని పోలీసులకు చెప్పాడు  కోటేశ్వర్రావు కొడుకు కుమార్‌. కొద్దిసేపు ప్రయత్నించిన తరువాత ఛిఠి ఆధారంగా పాస్‌వర్డ్‌ తెలుసుకోగలిగారు పోలీసులు. ఇంతకీ ఛిఠి అంటే?

మరిన్ని వార్తలు