మీకు తెలుసా?

6 Feb, 2016 23:29 IST|Sakshi
మీకు తెలుసా?

రష్యాకు చెందిన ఓ కుటుంబం విహార యాత్రకని అడవికి వెళ్లారు. అక్కడ వారి మూడేళ్ల పాప తప్పిపోయింది. పదకొండు రోజుల పాటు వెతికాక ఓ చోట కనిపించింది. అన్ని రోజులూ ఆ పాప ఓ గుంటలోని నీళ్లు తాగుతూ, రాలి పడిన బెర్రీస్ తింటూ గడిపిందట!
 
 జపాన్‌లోని టోక్యోలో హవారో అనే  బేకరీ ఉంది. అక్కడి ఫుడ్‌కి ఉన్న గిరాకీ టోక్యోలోని మరే బేకరీ ఫుడ్‌కీ ఉండదు. కారణం... ఈ బేకరీ ప్రతి తినుబండారాన్నీ అందమైన పూలతో అలంకరిస్తుంది. అయితే ఆ పూలు కూడా తినేవే కావడం, వాటి రుచి అద్భుతంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారట!
 
 అలాస్కన్ ఉడ్ ఫ్రాగ్ జాతికి చెందిన కప్ప... చలికాలంలో పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. దాని ఊపిరి ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. అయితే వేసవి వేడిమి తగలగానే మళ్లీ మామూలుగా అయిపోయి, చక్కగా జీవిస్తుందట!
 
 అమెరికాలో ‘హెల్స్ కిచెన్ షో’ పేరుతో వంటల పోటీలు నిర్వహిస్తుందో చానెల్. హోరాహోరీగా జరిగే ఆ పోటీలో ఎలిమినేట్ అయ్యే ప్రతి ఒక్కరికీ మానసిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పోటీదారులు డిప్రెస్ అయ్యి, తమను తాము ఏమీ చేసుకోకుండా ఉండేందుకే ఆ ఏర్పాటట!
 
 యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివిన విద్యార్థుల్లో ఇప్పటికి ఇరవై అయిదు మంది బిలియనీర్లు అయ్యారట. ప్రపంచంలోని మరే యూనివర్శిటీకీ ఈ ఘనత దక్కలేదు!
 

మరిన్ని వార్తలు