ప్లెయిట్‌ పోనీ

20 May, 2018 00:26 IST|Sakshi

ఈ హెయిర్‌ స్టయిల్‌ను ‘ప్లెయిట్‌ పోనీ’ అంటారు. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన పనిలేదు. పోనీ స్టయిల్‌ని ఇష్టపడేవారికి ఈ హెయిర్‌ స్టయిల్‌ బాగా నచ్చుతుంది. ఇందులో మామూలు పోనీనే కాకుండా, ఫ్రెంచ్‌ అల్లిక ఉండటం దీని స్పెషాలిటీ. గాగ్రా, స్కర్ట్, జీన్స్, శారీస్‌ అనే తేడా లేకుండా... అన్ని డ్రెస్సుల మీదికీ ఈ హెయిర్‌ స్టయిల్‌ భలేగా నప్పుతుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ ప్రయత్నించండి.

1 ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకో వాలి. హెయిర్‌స్ప్రే చేసుకొని దువ్వుకుంటే, జుత్తు మృదువుగా మారుతుంది. తర్వాత ఎడమ చెవివైపున కొంత జుత్తును తీసుకోవాలి. దాన్ని మూడు పాయలుగా చేసి ఓ అల్లిక అల్లాలి. తర్వాత ఆ మూడుపాయలను రెండుగా చేసి, ఎడమవైపు నుంచి ఓ సన్నని పాయను తీసుకొని అల్లుకోవాలి. అలా ప్రతిసారీ పక్కనుంచి సన్నని పాయలను తీసుకొని జడలో కలుపుకుపోవాలి. తర్వాత మిగిలిన పాయలతో జడను పూర్తిగా అల్లి, చివరికి బ్యాండ్‌ పెట్టుకోవాలి.

2  పై స్టెప్‌లో చేసినట్టుగానే, కుడివైపున కూడా మూడుపాయలను తీసుకొని అల్లాలి. తర్వాత కుడివైపు నుంచి సన్నని పాయలను తీసుకొని అల్లికల్లో కలుపుకొని అల్లుకోవాలి. ఆపైన మిగిలిన మూడు పాయలతో జడను పూర్తిగా అల్లి, బ్యాండ్‌ పెట్టుకోవాలి.

3 ఇప్పుడు ముందుభాగంలో కొంత జుత్తుకు ఏదైనా ప్లకర్‌ పెట్టి వదిలేయాలి. తర్వాత దానివెనుక వైపున్న జుత్తును స్ట్రెయిట్నింగ్‌ చేసుకోవాలి.

4 పై స్టెప్‌లోలాగే కొద్దికొద్దిగా జుత్తును చేతుల్లోకి తీసుకొని, స్ట్రెయిట్నర్‌తో స్ట్రెయిట్నింగ్‌ చేసుకోవాలి.

5 అలా సగం వరకు ముందుభాగం జుత్తునంతా స్ట్రెయిట్నింగ్‌ చేసుకున్నాక, వెనుకవైపున్న జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.

6 ఇప్పుడు ముందుభాగంలో ఉన్న జుత్తును, పఫ్ఫీగా వచ్చేలా వెనుకకు తీసుకురావాలి. కాస్తంత వదులుగా జడ మధ్యలోకి తీసుకొచ్చి, స్లైడ్స్‌ పెట్టుకోవాలి. పఫ్‌ వదులుకాకుండా ఉండేందుకు సరిపడా స్లైడ్స్‌ పెట్టుకోవాలి.

7  పై స్టెప్స్‌ను ఫాలో అవుతూ చేస్తూపోతే.. ఇప్పుడు మీ హెయిర్‌ స్టయిల్‌ ఫొటోలో కనిపిస్తున్నట్టుగా వస్తుంది.

8 తర్వాత ముందుభాగంలో వదిలేసిన జుత్తుకున్న ప్లకర్‌ను తొలగించి, ఆ జుత్తును వెనుకకు తీసుకురావాలి. ఆ జుత్తును కాస్తంత మెలితిప్పి స్లైడ్స్‌ పెట్టుకోవాలి. ఇప్పుడు జుత్తునంతటికీ కలిపి బ్యాండ్‌ పెట్టుకోవాలి.

9 ఆపైన ఇరువైపులా ఉన్న రెండు జడలనూ... మధ్యలోకి తీసుకొచ్చి బ్యాండ్‌ చుట్టూ చుట్టుకోవాలి. జడల చివర్లు కనిపించకుండా స్లైడ్స్‌ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో అందమైన హెయిర్‌ స్టయిల్‌ మీ సొంతం.

మరిన్ని వార్తలు