-

నమ్మకం: ఇలాంటివి నమ్ముతారా!

29 Sep, 2013 02:21 IST|Sakshi

కొన్ని దేశాలు అభివృద్ధి చెందినవిగా కనిపిస్తాయి. కానీ అక్కడి ప్రజల నమ్మకాలు చూస్తే, వీళ్లేంటి ఇలా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.  బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో బలంగా ఉన్న కొన్ని నమ్మకాలివి...
 {బెడ్ తయారు చేసినప్పుడు అది సరిగ్గా పొంగకపోతే, ఇంట్లో దుష్టశక్తి ఉందని నమ్ముతారు. వెంటనే ఆ బ్రెడ్ రెండు చివర్లనూ కత్తిరించి పారేస్తారు. అలా చేస్తే దెయ్యం బయటికి పోతుందట!
చాకు కిందపడితే మగ చుట్టం, ఫోర్క్ కిందపడితే ఆడ చుట్టం వస్తారట!
టేబుల్ మీద పూర్తి తెల్ల బట్టను పరచరు. ఒకవేళ పరిచినా, పడుకునేముందు తీసేస్తారు. తీయకుండా రాత్రంతా ఉంచేస్తే, ఎవరో మరణిస్తారని భయపడతారు!
ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు గబ్బిలం గానీ అతడి కంటపడితే... కచ్చితంగా ఏదో పెద్ద ఘోరం జరుగుతుందట!
 నెమలీకలోని కన్ను దెయ్యానికి ఆశ్రయమిస్తుందట. అందుకని ఇంట్లో ఉంచుకోరు.
ఉప్పు ఒలికితే దురదృష్టం వచ్చి నెత్తిమీద కూర్చుంటుందట. ఒకవేళ పొరపాటున ఒలికితే దాన్ని ఎత్తి, తల తిప్పకుండా, భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని అంటారు. అలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందట!
 కొత్త చెప్పులు, బూట్లు టేబుల్ మీద పెడితే దరిద్రం ఇంట్లో తిష్ట వేస్తుందట!
నాలుగు ఆకులున్న లవంగం మొక్కను చూస్తే సంపద వరిస్తుందని ఓ విశ్వాసం!
గుమ్మంలో నిలబడి గొడుగును తెరిస్తే... ఇక కష్టాలు తప్పవట!
 పిచ్చుక ఇంట్లోకి వస్తే చంపేయాలట. లేదంటే దానితో పాటే మన సర్వ సంపదలూ ఎగిరిపోతాయనే నమ్మకం బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది!

మరిన్ని వార్తలు