పాఠక స్పందన

28 Mar, 2015 21:59 IST|Sakshi

సంగీత దర్శకుడు ఇళయరాజా వెయ్యి సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు వంశీ కవర్‌స్టోరీ రాయడం మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. కథనం ఆద్యంతం చదివించింది.
 - కె.సతీష్‌బాబు, కడప, వైఎస్సార్ జిల్లా
 
 దేశ రక్షణతో పాటు తమకు సామాజిక బాధ్యత కూడా ఉందంటూ ఆర్మీ కాన్వాయ్‌లో పిల్లలను పరీక్షకేంద్రానికి పంపి వారి విద్యాసంవత్సరాన్ని వృథా కాకుండా కాపాడిన వైనాన్ని ‘యుద్ధక్షేత్రం’లో కల్నల్ పి.ప్రసాద్ వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. శ్రీరమణ ‘శ్రీకారాలు- శ్రీ మిరియాలు’ ఫన్నీగా చురుక్కుమనిపించేలా ఉంటున్నాయి.
 - యు.చిట్టిబాబు, న్యూ పాల్వంచ, ఖమ్మం
 
 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణుల అభిప్రాయాలను కూర్చి ప్రచురించిన కథనం చక్కగా ఉంది. సంపాదకవర్గానికి అభినందనలు.
 - ప్రఫుల్ల చంద్ర, ధర్మవరం, అనంతపురం
 
 మార్చి 8నాటి సంచికలో శ్రీరమణ శీర్షిక ‘శ్రీకారాలూ - శ్రీమిరియాలు’లో ప్రస్తావించిన ఎస్వీరంగారావుగారి ఉదంతం ‘పాండవ వనవాసం’లోనిది కాదు. ‘నర్తనశాల’ సినిమాలోనిది.
 - కట్టకోలు సుబ్బారెడ్డి, ఉయ్యూరు
 
 మార్చి ఎనిమిది ఫన్‌డేలో ఇంటెలిజన్స్ విభాగం అధికారి మహేశ్ భగవత్ చెప్పిన రియల్‌క్రైమ్ స్టోరీ ‘తొమ్మండుగురు తోడేళ్లు’ ఆసక్తికరంగా ఉంది. ఈ కథనాన్ని చదవడం వల్ల నాకు మీడియాపై ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోయింది.
 - తురకా శ్రీనివాస్‌రాజు,
 కొత్తూరు. ఇ-మెయిల్
 
 బెస్ట్‌కేస్ ఫీచర్ చాలా బాగుంటుంది. పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేలా ఉంది. ఈ ప్రయత్నంలో సాక్షి కృషి అభినందనీయం.
 - వై.సంజీవ్, పోతంగల్, ఇ-మెయిల్
 
 మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
 ఫోన్: 040-23256000
 funday.sakshi@gmail.com

మరిన్ని వార్తలు