ఫ్రిజ్‌కి ‘ముక్కు’ వచ్చింది!

1 May, 2016 01:00 IST|Sakshi
ఫ్రిజ్‌కి ‘ముక్కు’ వచ్చింది!

కుళ్లిపోయిన లేదా కుళ్లిపోవ డానికి సిద్ధంగా ఉన్న ఏ ఆహార పదార్థాలనైనా, మనం వాసనను బట్టి ఇట్టే పసిగడుతుంటాం. కానీ ఫ్రిజ్‌లో ఉన్నవి అలా గుప్పుమని వాసన వేయవు. దాంతో మనం వాటిని పట్టించుకోం. బాగానే ఉంటాయ్‌లే అనుకుంటాం. తీరా అవసరమై చూసేసరికి అవి కాస్తా కుళ్లిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రిజ్‌కి ఓ ముక్కుని తగిలించండి. అంటే... ఈ ‘ఫ్రిజ్ నోస్’ అనే పనికరాన్ని బిగించండి. ఇది ఓ ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో సెన్సార్లు ఉంటాయి.

ఫ్రిజ్‌లో పదార్థాలు పాడైపోయే దశకు కనుక చేరుకుంటే ఇది పసిగట్టేస్తుంది. అలారం మోగించి మనల్ని అలర్ట్ చేస్తుంది. దాంతో మనం వెంటనే వాటిని వాడేయవచ్చు. వద్దు అనుకుంటే కుళ్లిపోయేలోపే తీసి పారేయొచ్చు. భలేగా ఉంది కదూ ఈ ‘ముక్కు’ ముచ్చట!

మరిన్ని వార్తలు