భాషణం : తప్పు + తప్పు = నాట్ ఒప్పు

3 Aug, 2013 21:07 IST|Sakshi

ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదే. అయితే రెండు నాలుకలు, రెండు ముఖాలు ప్రమాదంలో పడేస్తాయి. ITI student who killed girlfriend suspected her of two-timing him అని ఈ మధ్య ఓ వార్త. మోసం చేసిందన్న అనుమానంతో ఓ ఐటిఐ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్‌ని చంపేశాట్ట. Two-timing అంటే ఇంకో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకోవడం. Two-timer అంటే అలా సంబంధం పెట్టుకున్న వ్యక్తి. సాధారణంగా భర్తల్లో two-timers ఎక్కువగా ఉంటారట. ప్రేయసీప్రియుల్లో two-timers ఉన్నా లేకున్నా, ఆ  అనుమానం మాత్రం ఉంటుంది కొందరు ప్రేమికులలో.
 
 అదే అనుమానం మన ఐటీఐ స్టూడెంట్‌కీ వచ్చినట్లుంది. సరే, ఆ అమ్మాయి నిజంగానే ్టఠీౌ్టజీఝజీజ చేసిందనుకుందాం. అంతమాత్రాన చంపేయడమేనా? అమ్మాయి తప్పు చేసిందని, అబ్బాయీ తప్పు చేయడం ఒప్పవుతుందా? Two wrongs don't make a right అని ఇంగ్లిష్‌లో ఒక సామెత. అంటే... మనకెవరో చెడు చేశారని, మనమూ వారికి చెడు చేయడం తగనిపని.
 ఖీఠీౌ అనే పదంతో ఇంకా అనేక పదబంధాలు ఉన్నాయి. Two-up, two-down అనేది వాటిల్లో ఒకటి.  యు.కె.లో వాడుక ఎక్కువ. రెండంతస్థుల చిన్న ఇంటిని టు-టాప్, టు-డౌన్ అంటారు.  వీటికి హాళ్లు కింది అంతస్థులో, పడక గదులు పైఅంతస్థులో ఉంటాయి. Two-hander అంటే ఇద్దరు నటుల కోసమే రాసిన నాటకం. Two-bit అంటే అంత ముఖ్యమైనదేం కాదని.  It takes two to tango అంటే... తప్పు ఇద్దరిదీ అని చెప్పడం. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు అనే అర్థం వచ్చే ఆంగ్ల లోకోక్తి ఇది.

మరిన్ని వార్తలు