అంతరిక్షం నుంచి అద్భుత ప్రదర్శన

25 Aug, 2019 13:16 IST|Sakshi

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఒక అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఆ అద్భుత ప్రదర్శన దృశ్యాన్ని మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నౌకలోని ప్రయాణికు లకు లైవ్‌గా ప్రసారం చేశారు. నౌకలోని దాదాపు మూడువేల మంది ప్రయాణికులు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ కేరింతలు కొట్టారు. ‘యూరోన్యూస్‌’ స్పేస్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న వ్యోమగామి లూకా పార్మిటానో చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 13 రాత్రివేళ అంతరిక్ష వేదికపై డీజే ప్రదర్శన చేశారు. డీజే మ్యూజిక్‌కు అనుగుణంగా ఆయన డ్యాన్స్‌ చేశారు. దాదాపు ఇరవై నిమిషాలు సాగిన ఈ కార్యక్రమం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

మరిన్ని వార్తలు