ఫార్మల్ బ్రెయిడెడ్ అప్‌డూ

3 Jul, 2016 00:40 IST|Sakshi
ఫార్మల్ బ్రెయిడెడ్ అప్‌డూ

సిగ సింగారం
ఇది ‘ఫార్మల్ బ్రెయిడెడ్ అప్‌డూ’ అనే హెయిర్ స్టయిల్ రకంలో ఒకటి. ఇది చాలా ఫార్మల్‌గా, డిగ్నిఫైడ్‌గా కనిపిస్తుంది. గాగ్రా, గౌన్లకే కాదు.. ఈ బ్రెయిడెడ్ అప్‌డూ ఫ్యాన్సీ సారీస్ మీదకు కూడా భలేగా నప్పుతుంది. మీకూ ఈ కొత్త కొప్పు సోయగం కావాలనుకుంటే... వెంటనే ట్రై చేయండి మరి.

 
ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత మధ్య పాపిట కాకుండా కుడిచెవి వైపు నుంచి తీయాలి. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఎడమవైపు భాగం నుంచి మూడు సన్నని పాయలను తీసుకొని కాస్త అల్లుకోవాలి.
 
ఇప్పుడు కుడి, ఎడమ వైపుల నుంచి ఒక్కోపాయను తీసుకుంటూ ఈ జడలో కలుపుకుంటూ పోవాలి. (జడను ఇన్‌సైడ్ అవుట్ (రివర్స్) అల్లుకుంటూ పోవాలి)
 
ఆ జడను ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూర్తిగా అల్లి, చివర ఒక బ్యాండ్ పెట్టేయాలి.
 
తర్వాత కుడివైపున్న జుత్తును ఎడమవైపుకు తీసుకొచ్చి, మూడు పాయలుగా చేసుకోవాలి.
 
ఇప్పుడు ఆ పాయలను కూడా పూర్తి జడలా రివర్స్‌లోనే అల్లి బ్యాండ్ పెట్టేయాలి.
 
ఎడమచెవి వైపు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా... ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి.
 
పైన విధంగానే రెండో జడను కూడా టైట్‌గా లేకుండా వదులు చేసుకోవాలి.
 
ఇప్పుడు ముందుగా కుడిచెవి వైపున్న జడను ఎడమ వైపుకు తీసుకువచ్చి.. గుండ్రంగా చుట్టి కొప్పుగా చేసి స్లైడ్స్ పెట్టేయాలి.
 
తర్వాత ఎడమవైపు ఉన్న జడను ఆ కొప్పు చుట్టూ చుట్టి స్లైడ్స్ పెట్టాలి. ఆపైన ఏదైనా ఆర్టిఫీషియల్ ఫ్లవర్‌తో ఆ కొప్పును అలంకరించుకుంటే ఆ అందమే వేరు.

మరిన్ని వార్తలు