చక్కటి చుక్కలా

19 May, 2019 00:38 IST|Sakshi

న్యూ ఫేస్‌ 

ముఖ సౌందర్యానికి ఫేస్‌ క్రీమ్స్, లోషన్స్‌.. ఇలా చాలానే కొంటుంటారు మగువలు. కానీ మృదువైన మోము కోసం వాటికంటే ముఖ్యంగా.. సహజసిద్ధమైన చిట్కాలను పాటించడమే మంచిదంటున్నారు నిపుణులు. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇంటిపట్టున సిద్ధం చేసుకున్న సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి: క్లీనప్‌ : బాదం పాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్‌
స్క్రబ్‌ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు
మాస్క్‌:  తులసి గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్, గంధం – 1 టీ స్పూన్‌

తయారీ: ముందుగా బాదం పాలు, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, టమాటా గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, చిక్కటి పాలు, గంధం బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు