సౌందర్యరాశిలా

12 Aug, 2018 00:38 IST|Sakshi

న్యూ ఫేస్‌

చర్మసంరక్షణకు కాసింత సమయం కేటాయిస్తే చాలు.. ఎలాంటి ఫేస్‌క్రీమ్స్, లోషన్లతో పనిలేకుండా సౌందర్యరాశిలా మెరిసిపోవచ్చు. ఇంటిపట్టున దొరికే పసుపు, పెరుగు వంటి మిశ్రమాలతోనే చర్మకాంతిని రెట్టింపు చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు లేని అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇలా క్లీనప్, స్క్రబ్‌లతో పాటు ఫేస్‌ప్యాక్‌ని కూడా ప్రయత్నించండి. అందాన్ని రెట్టింపు చేసుకోండి.

కావల్సినవి: 
క్లీనప్‌ : కీరదోస రసం(జ్యూస్‌) – 3 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, పెరుగు – అర టీ స్పూన్‌
స్క్రబ్‌ : కోకో పౌడర్‌ – అర టేబుల్‌ స్పూన్, ఓట్స్‌ – అర టేబుల్‌ స్పూన్, వెన్న – అర టీ స్పూన్, రోజ్‌ వాటర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
మాస్క్‌ : అవొకాడో – సగం ముక్క (మీడియం సైజ్‌), తేనె – 1 టేబుల్‌ స్పూన్, పెరుగు మీగడ – అర టీ స్పూన్, పసుపు – కొద్దిగా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని కీరదోస రసం, తేనె, పెరుగు బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్,ఓట్స్, వెన్న ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్‌ చేసుకుని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అవొకాడో శుభ్రం చేసుకుని గుజ్జులా చేసుకుని, అందులో తేనె, పెరుగు మీగడ, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు