చర్మకాంతికి చక్కటి చిట్కా

30 Sep, 2018 01:18 IST|Sakshi

న్యూ ఫేస్‌

ఎంత ఖరీదైన కాస్మొటిక్స్‌ వాడినా ముఖం నిగారింపును కోల్పోతుందా? ఎన్ని లోషన్స్‌ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను నమ్ముకోండి. ఇలా ప్రయత్నించండి. ఫేస్‌ప్యాక్‌ వేసుకునే ముందు క్లీనప్‌ చేసుకుని, స్క్రబ్‌ చేసుకుని, ఆవిరి పట్టించుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది.

కావల్సినవి : క్లీనప్‌ : పాలు – 1 టేబుల్‌ స్పూన్‌బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్‌
స్క్రబ్‌ : కొబ్బరి నూనె – 3 టీ స్పూన్లు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్లు, పచ్చిపసుపు – పావు టీ స్పూన్‌ (పసుపు కొమ్ము), పెరుగు – అర టీ స్పూన్‌
మాస్క్‌ : టమాటా జ్యూస్‌ – అర టేబుల్‌ స్పూన్‌పుదీనా గుజ్జు – 4 టీ స్పూన్లు, ముల్తాని మట్టి – 2 టీ స్పూన్లు
తయారీ :  ముందుగా ఒక బౌల్‌ తీసుకుని పాలు, బియ్యప్పిండి, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె, పంచదార, పచ్చిపసుపు, పెరుగు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు టమాటా జ్యూస్, పుదీనా గుజ్జు, ముల్తాని మట్టి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు