మెరుపు చూడతరమా!

23 Dec, 2018 00:13 IST|Sakshi

న్యూ ఫేస్‌

ఖర్చుతో కూడిన ఫేస్‌ క్రీమ్స్‌ కంటే.. ఖర్చులేని సహజసిద్ధమైన చిట్కాలే ముఖానికి అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. అందుకే మరి మీ ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చించండి. ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం మరింత కాంతివంతం అవుతుంది. మచ్చలు, మొటిమలు లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. 

కావల్సినవి : క్లీనప్‌ : రోజ్‌వాటర్‌ – 1 టీ స్పూన్, గ్లిజరిన్‌ – 3 లేదా 4 చుక్కలు
 స్క్రబ్‌ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పెసర పిండి – అర టీ స్పూన్‌  మాస్క్‌ : చిక్కటి పాలు – 2 టీ స్పూన్లు, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, శనగ పిండి – అర టీ స్పూన్‌
తయారీ : ముందుగా రోజ్‌వాటర్, గ్లిజరిన్‌ చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, బియ్యప్పిండి, పెసర పిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, కీరదోస గుజ్జు, శనగపిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు