ఆకర్షణీయమైన అందం

10 Mar, 2019 01:04 IST|Sakshi

న్యూ ఫేస్‌ 

సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే.. ఫేస్‌ క్రీమ్స్, లోషన్స్‌తో పనిలేదంటున్నారు నిపుణులు. ముఖంపైన మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు కెమికల్స్‌తో తయారుచేసిన మార్కెట్‌ ప్రొడక్ట్స్‌తో పనిలేదంటున్నారు. మరైతే సహజసిద్ధమైన చిట్కాలతో వచ్చే ఫలితాలను మీరూ ప్రయత్నించండి.

కావాల్సినవి : 
క్లీనప్‌ : టమాటా గుజ్జు – 1 టేబుల్‌ స్పూన్, గడ్డపెరుగు – అర టీ స్పూన్‌
 స్క్రబ్‌ : ఓట్స్‌ – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు
మాస్క్‌:  యాపిల్‌ గుజ్జు – 3 టీ స్పూన్లు, చిక్కటి పాలు – అర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్,  పసుపు – చిటికెడు

తయారీ :  ముందుగా టమాటా గుజ్జు, గడ్డపెరుగు ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కీరదోస గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు యాపిల్‌ గుజ్జు, చిక్కటి పాలు, పసుపు, తేనె కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిరుమల మందిర సుందరా!

చెరువుకాడి చింతచెట్టు

సాక్షి

దాసర  అంజప్ప కోడి  కథ

మానవాళిపై కత్తి దూసింది...

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు