అందానికి సరైన చిట్కా

20 Jan, 2019 00:34 IST|Sakshi

న్యూ ఫేస్‌ 

స్పెషల్‌ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేస్‌క్రీమ్స్‌ వాడుతుంటారు చాలా మంది. అయితే ఆ క్రీమ్స్‌ కేవలం ఆ క్షణానికి మాత్రమే మెరుపునిస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునేకంటే... శాశ్వతంగా తొలగిపోయేందుకు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే. అప్పుడే అందం సహజత్వాన్ని పొందుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : క్లీనప్‌ : ఆరెంజ్‌ జ్యూస్‌ – 3 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్, గ్లిజరిన్‌ – 3 చుక్కలు
 స్క్రబ్‌ : ఓట్స్‌ – 1 టీ స్పూన్, యాపిల్‌ గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్‌
మాస్క్‌: కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, జామపండు గుజ్జు – 2 టీ స్పూన్లు (గింజలు తొలగించి)
తయారీ : ముందుగా తేనె, గ్లిజరిన్, ఆరెంజ్‌ జ్యూస్‌ ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్‌ గుజ్జు, చిక్కటి పాలు, ఓట్స్‌ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామపండు గుజ్జు, కొబ్బరిపాలు, శనగపిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది.

మరిన్ని వార్తలు