చంద్రబింబం: డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు

8 Dec, 2013 02:37 IST|Sakshi
చంద్రబింబం: డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. శాస్త్ర, సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. వారం మధ్యలో ధనవ్యయం. చికాకులు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం.  వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 బంధువులతో స్వల్ప వివాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులు కొంత మేర ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీవేత్తలకు పదవీయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు. పనుల్లో  జాప్యం. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం చివరిలో విందువినోదాలు. ఆస్తిలాభం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 వ్యయప్రయాసలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఒప్పందాలలో జాప్యం. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించాలి. వారం ప్రారంభంలో గృహయోగం. కుటుంబంలో శుభకార్యాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆస్తి వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి. ఒక సమాచారం విద్యార్థులకు ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కళారంగం వారికి నిరాశ. వారం మధ్యలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపార, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. కొత్త రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు జరుగవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఇంటర్వ్యూలు అందుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 కార్యక్రమాలు విజయవంతంగా పూర్త్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై మక్కువ చూపుతారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కడం విశేషం. వీరికి ద్వితీయార్థంలో ఆరోగ్యభంగం. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండవచ్చు.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 రజనీకాంత్ పుట్టినరోజు: డిసెంబర్12

మరిన్ని వార్తలు