కేక్‌ తయారీ విధానం

15 Mar, 2020 12:02 IST|Sakshi

స్వీట్‌ కార్న్‌ కేక్‌
కావలసినవి:  స్వీట్‌ కార్న్‌ – 3 కప్పులు
బటర్‌ – అర కప్పు, అరటిపండు గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
పంచదార – ఒక కప్పు
మొక్కజొన్న పిండి – అర కప్పు
గుడ్లు – 3 (తెల్లసొన మాత్రమే)
నీళ్లు – కొద్దిగా
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – పావు టీ స్పూన్‌
తయారీ: ముందుగా స్వీట్‌ కార్న్, పంచదార రెండూ కలిసి మిక్సీ పెట్టుకుని ముద్దలా చేసుకోవాలి. అందులో కరిగించిన బటర్, గుడ్ల తెల్లసొన, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, మొక్కజొన్న పిండి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని, సమాంతరంగా చేసుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద ట్రేలో ఆ ట్రేను పెట్టుకుని.. అడుగున నీళ్లు నింపుకుని.. రెండూ కలిపి, ఓవెన్‌లో పెట్టి ఉడికించుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఐస్‌క్రీమ్‌ స్కూపర్‌తో తీసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

క్రిస్పీ బ్రెడ్‌ బోండా
కావలసినవి:  బ్రెడ్‌ స్లైస్‌ – 12
నీళ్లు – 1 కప్పు
బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి ముద్ద చేసుకోవాలి)
పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌
అల్లం పేస్ట్‌ – అర టీ స్పూన్‌
పసుపు – కొద్దిగా
ఆలివ్‌ నూనె, నిమ్మరసం – 1 టీ స్పూన్‌ చొప్పున
కొత్తిమీర గుజ్జు –1 టేబుల్‌ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో.. బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర గుజ్జు, ఆలివ్‌ నూనె, ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ స్లైస్‌లను నాలుగువైపులా (బ్రౌన్‌ కలర్‌ భాగం) తొలగించి.. ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ని నీళ్లలో బాగా తడిపి.. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న బాల్‌ పరిమాణంలో తీసుకుని, అందులో పెట్టుకోవాలి. తర్వాత ఆ స్లైస్‌ని నాలుగు వైపుల నుంచి కలుపుతూ.. గుండ్రంగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లతో తడి చేసుకుంటూ బంగాళదుంప మిశ్రమం కనిపించకుండా క్లోజ్‌ చెయ్యాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకోవాలి.

డేట్స్‌ శాండ్‌విచ్‌
కావలసినవి:  ఖర్జూరం – అర కప్పు (గింజలు తొలగించి, మిక్సీ పట్టుకోవాలి)
బ్రెడ్‌ స్లైస్‌ – 6 (త్రిభుజాకారంలో ఒక్కో స్లైస్‌ని రెండు ముక్కలు చొప్పున కట్‌ చేసుకోవాలి)
వాల్‌నట్స్‌  2 టేబుల్‌ స్పూన్‌(మిక్సీ పట్టుకోవాలి)
బాదం – 3 టేబుల్‌ స్పూన్‌ (నానబెట్టి, పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి)
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు
మొక్కజొన్న పిండి – పావు కప్పు
బటర్‌ – పావు కప్పు (కరింగించి)
గడ్డ పెరుగు – 2 కప్పులు(ఒక మంచి క్లాత్‌లో మొత్తం పెరుగు వేసుకుని, రెండుమూడు సార్లు గట్టిగా పిండి, 3 గంటల పాటు ఓ పక్కగా వేలాడదీయాలి. 3 గంటల తర్వాత నీటిశాతం తగ్గి, క్రీమ్‌లా తయారవుతుంది)
జీడిపప్పు ముక్కలు, కిస్మిస్‌ – అభిరుచిని బట్టి..
ఖర్జూరం ముక్కలు – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు (అదనంగా తీసుకోవాలి) 
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బ్రెడ్‌ పౌడర్, మొక్కజొన్న పిండి, బటర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గుజ్జు, బాదం పేస్ట్, వాల్‌నట్‌ పేస్ట్, క్రీమ్‌లా సిద్ధం చేసుకున్న పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలో ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్‌ ఇలా నచ్చిన డ్రైఫ్రూట్స్‌ వేసుకుని అటు ఇటు ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండేసి త్రిభుజాకారపు బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని కొద్దికొద్దిగా ఖర్జూరం మిశ్రమాన్ని పెట్టుకుని.. రెండువైపులా గ్రిల్‌ చేసుకుంటే అదిరే రుచి మీ సొంతవుతుంది. 

మరిన్ని వార్తలు