సరిహద్దు

25 Feb, 2018 00:58 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘‘అంకుల్‌!’’ అని తలుపు తట్టాడు రాజబాబు.  జేమ్స్‌ తలుపు తీశాడు. ఎదురుగా రాజబాబు కనిపించాడు. వాడి చేతిలో ఒక హాట్‌ డిష్‌ ఉంది.  ‘‘ఏందిరా రాజూ!’’ అన్నాడు. ‘‘పిన్ని పంపింది. చేపల కూర.’’ ‘‘నిన్ననే కదరా క్రిస్టమస్‌ అని బిర్యానీ వండింది. తెల్లారి మళ్లీ చేపల కూరా? ఎవరు తెచ్చారు?’’ ‘‘భుజంగం అంకుల్‌’’ చెప్పాడు రాజబాబు. జేమ్స్‌ ముఖంలో రంగులు మారాయి. డిష్‌ తీసుకుని తలుపు వేసుకున్నాడు. ‘దీనికి నేను చాల్లేదేమో? భుజంగం గాడిని తగులుకుంది’ అనుకుని పళ్లు కొరుక్కున్నాడు జేమ్స్‌.‘‘రాధమ్మొదినా?’’ అంటూ తలుపు తట్టింది సూరమ్మ.అప్పుడు ఉదయం పదకొండు. సూరమ్మ ఇంటికి చుట్టం వచ్చాడు. కాఫీ పొడి నిండుకుంది. రాధారాణి రోజుకు నాలుగు సార్లు కాఫీ తాగుతుందని తెలుసు. కాఫీ పొడి అడగడానికి వచ్చింది పాపం. ఘోరమైన దృశ్యాన్ని తాను చూడబోతున్నానని అప్పుడు ఆమెకు తెలియదు.తలుపు తెరుచుకుంది. సూరమ్మ చొరవగా లోపలికి వెళ్లింది. వంట గదిలో రాధారాణీ లేదు. పెరటిలోనూ లేదు. ‘ఎక్కడికి వెళ్లిందబ్బా?’ అనుకుంటూ పడక గదివైపు వెళ్లింది. అంతే....! కెవ్వున కేకపెట్టింది సూరమ్మ.మంచం మీద రాధారాణీ నెత్తురుమడుగులో పడి ఉంది. ఎవరో గొంతుకోసి హత్య చేశారు. సూరమ్మ భయంతో వణుకుతూ వీధిలోకి పరిగెత్తి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు ఆడవాళ్లు అక్కడికి చేరారు. 

పెదవడ్లపూడిలో హత్య జరిగిందని సమాచారం అందగానే పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ రంగనాయకులు, ఎస్సై గోపాల్‌  కానిస్టేబుల్స్‌ని తీసుకుని బయలు దేరాడు. చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ ఉన్న డాబా ఇల్లు. అక్కడ జనం చేరివున్నారు. రంగనాయకులు గదిలోకి వెళ్లి చూశాడు. హతురాలు రాధారాణీ వెల్లకిలా పడి ఉంది. గొంతు కోసి చంపారు. రాధారాణి భర్త శేషయ్య విచారంగా కూర్చుని ఉన్నాడు. పంచనామా ముగించి రిపోర్ట్స్‌ కోసం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.‘‘శేషయ్యగారూ..! చెప్పండి, పట్టపగలు హత్య చేశారంటే మీకు ఎవరో శత్రువులు ఉండి ఉండాలి?’’ అడిగాడు ఇన్స్‌పెక్టర్‌.‘‘మాకు శత్రువులు ఎవరూ లేరండీ’’ అన్నాడు శేషయ్య.‘‘బాగా ఆలోచించి చెప్పండి. మీకు విరోధులు లేకపోవచ్చు. మీ భార్యకు ఎవరైనా ఉన్నారేమో.. జ్ఞాపకం చేసుకోండి.’’శేషయ్య తల వంచుకుని ఉండిపోయాడు.పెదవడ్లపూడిలో పోలీసులు చేసిన ఎంక్వైరీలో చాలా విషయాలు బయట పడ్డాయి రాధారాణి గురించి. రాధారాణిని శేషయ్య తన మొదటి భార్య చనిపోయిన తరువాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పుట్టిల్లు బిర్రావూరు. చాలా పేదకుటుంబం. పాతికేళ్లు దాటిపోయినా ఆమెకు పెళ్లి చెయ్యలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. అప్పుడు శేషయ్య సంబంధం కుదిర్చారు. వయసులో చాలా తేడా ఉన్న గతిలేక పెళ్లి చేశారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. మొదటి భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. వాడే రాజబాబు. తల్లి చనిపోయిన తరువాత మేనమామ తీసుకెళ్లి కొంతకాలం పెంచాడు. రాజబాబుకి పదేళ్ల వయసు వచ్చాక.. శేషయ్య తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది రాధారాణికి ఇష్టంలేదు. వాడిని బడికి పంపకుండా గొడ్డుచాకిరీ చేయిస్తుంది. తిడుతుంది. కొడుతుంది. గేదెలను మేపుకు రమ్మని పంపుతుంది. తిండి కూడా సరిగా పెట్టదు. తన ఇద్దరు కూతుళ్లను మాత్రం చక్కగా పంపిస్తుంది. అదీ బస్సులో.

ఆమెకు జేమ్స్‌ అనేవాడితో అక్రమ సంబంధం ఉంది. అతడు టైలర్‌. ఒంటరిగా ఉంటాడు. వాళ్లిద్దరి సంగతి ఊరంతా తెలుసు. పల్లెటూళ్లలో ఇలాంటివి రహస్యంగా దాగవు.ఇన్స్‌పెక్టర్‌ శేషయ్యను ఇన్స్‌పెక్టర్‌ స్టేషన్‌కు పిలిచాడు.‘‘మీ భార్యకు టైలర్‌ జేమ్స్‌తో సంబంధం ఉందని తెలిసింది. ఆ విషయంలో మీరేమైనా మీ భార్యను కట్టడి చేశారా? సంబంధం మానుకోమని బెదిరించారా?’’ ప్రశ్నించాడు రంగనాయకులు.‘‘బెదిరించిన మాట నిజమే కానీ వాడు హత్య చేసి ఉండడు సార్‌.. ఎందుకంటే వాడికి ఏదైనా కోపం ఉంటే నా మీద ఉండాలి. కానీ నా భార్యమీద ఎందుకు ఉంటుంది? నాకైతే జేమ్స్‌ మీద అనుమానం లేదండి’’చెప్పాడు శేషయ్య.శేషయ్య న్యాయంగానే చెప్పాడని ఇన్స్‌పెక్టర్‌కు అనిపించింది. శేషయ్య కొడుకు రాజబాబుని ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్‌. వాడికి 14 ఏళ్లు. తను ఆ రోజు పొద్దున్నే గేదెలను కాలువ ఒడ్డున మేపడానికి తీసుకుపోయానన్నాడు.పిన్ని చద్దన్నం కట్టి ఇస్తుంది. మధ్యాహ్నం అది తిని సాయంకాలం ఇంటికి చేరుకుంటాడు. రోజు చేసే పని అదే. అంతకుముందు తెల్లవారుతూనే పాలు తీస్తుంది పిన్ని. వాటిని క్యాన్‌లో తీసుకెళ్లి డెయిరీ సెంటర్‌లో పోసి వస్తాడు. 

రాజబాబు తన దినచర్య గురించి వివరించాడు.‘‘మీ పిన్నిని ఎవరు చంపి ఉంటారు? నీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’’‘‘జేమ్స్‌ మీద అనుమానం ఉందండి.’’‘‘ఎందుకు??’’‘‘మా పిన్ని వాడి దగ్గరకు పోవడం తగ్గించిందని కోపమండీ.’’‘‘ఎందుకు??’’‘‘కాలువల మీద పనిచేస్తాడు చూడండీ. భుజంగం అని. ఆయన మా ఇంటికి వస్తున్నాడని జేమ్స్‌కి కోపమండి’’ చెప్పాడు రాజబాబు.రంగనాయకులకు ఏదో క్లూ దొరికినట్లు అనిపించింది. రాధారాణికి చాలా కాలంగా జేమ్స్‌తో సంబంధం ఉంది. ఆమెకి కొత్తగా పంట కాలువల మీద పనిచేసే భుజంగం పరిచయం అయ్యాడు. రాధారాణీ ఇద్దరినీ ఆడిస్తూ పబ్బం గడుపుకుంటోంది. జేమ్స్‌కి అది సహించరాని విషయమే. జేమ్స్‌ని స్టేషన్‌కి పిలిచి తమదైన శైలిలో విచారించారు పోలీసులు. అతడు లబోదిబోమని ఏడ్చాడు. తనకు ఏ పాపం తెలియదని మొత్తుకున్నాడు. రాధారాణితో అక్రమ సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడు. భుజంగం ఆమె కోసం వస్తాడని రాజబాబు చెప్పాకే తెలిసిందన్నాడు.తనకు ఆమెమీద కోపం ఉందికానీ హత్య చేసింది మాత్రం తాను కాదని ఒట్లు పెట్టుకున్నాడు. హత్య చేసేంత కోపం ఉంటే.. ఆమె భర్తకు ఉంటుంది. పరువు పోతుందని ఫీలై అతడే చంపి ఉంటాడన్నాడు జేమ్స్‌. ‘‘రాధారాణి మాకు దూరపు బంధువు. ఎప్పుడన్నా వెళ్లి పలకరిస్తూ ఉండేవాణ్ని. నాకు ఎవరైనా చేపలు ఇచ్చినప్పుడు ఇస్తుండేవాణ్ని. అంతే సార్‌! నాకు, ఆమెకు అక్రమసంబంధం ఏమీ లేదు. నా భార్య, పిల్లలు మంగళగిరిలో ఉంటారు. నేను డ్యూటీ మీద ఊళ్లు తిరుగుతుంటాను. రాధారాణి హత్యకు గురైందని తెలిసి చాలా బాధపడ్డాను. ఇంతలోనే ఇందులోకి నా పేరు రావడం మరీ దారుణం సార్‌. నాకేం సంబంధం లేదు’’ చెప్పాడు భుజంగం.

 ‘‘సార్‌! హత్యకు ఉపయోగించిన వెపన్‌ దొరకలేదు. ఆ ఇంట్లో బయటివాళ్ల వేలిముద్రలేమీ లేవు. నా అనుమానం రాధారాణి భర్త మీదే ఉంది’’ చెప్పాడు ఎస్సై గోపాల్‌.ఇన్స్‌పెక్టర్‌ ఆలోచలో పడ్డాడు. హత్యకేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. విచారణలోనే రోజులు గడుస్తున్నాయి. ఎవరైనా దొరికారా? అంటూ డీఎస్పీ ఫోన్‌ చేసి షంటుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎవరిమీదైనా కేసు పెట్టి కోర్టుకు పంపితే ఏం లాభం? డిఫెన్స్‌ లాయర్‌ అడిగే ప్రశ్నలకు తమ దగ్గర జవాబు ఉండదు. కేసు కొట్టేస్తారు.‘‘సార్‌! రాధారాణిని హత్య చేసే అవసరం శేషయ్యకే ఉంది. జేమ్స్‌ ఒంటరివాడు. పైగా రాధారాణి వల్ల సుఖం పొందుతున్నాడు. ఆమెను చంపితే వాడికేం లాభం. పోనీ డబ్బు కోసం వాడిని పీడించే అవసరం రాధారాణికి లేదు. పొలం ఉంది. పాడి మీద ఆదాయం ఉంది. స్థితిమంతుల కుటుంబం. భర్త దగ్గర దొరకని సుఖం కోసం జేమ్స్‌ దగ్గరకు పోతోంది కానీ డబ్బు కోసం కాదు. ఆమె భర్త శేషయ్యకు పరువుప్రతిష్టల సమస్య. ఎంత చెప్పినా అక్రమసంబంధం వదులుకోవడానికి ఇష్టపడి ఉండదు. ఇక గత్యంతరం లేక అతనే తన భార్యను హత్య చేసుంటాడు’’ అన్నాడు ఎస్సై.పెదవడ్లపూడి ఊళ్లోవాళ్లు కూడా శేషయ్యనే అనుమానిస్తున్నారు. లేకపోతే రాధారాణిని చంపాల్సినంత కోపం ఎవరికి ఉంటుంది?ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడని శేషయ్య చంపి ఉంటాడు. అందుకే ఆధారాలు దొరకలేదని పోలీసులు నిర్ణయించుకున్నారు. శేషయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు ఫైల్‌ చేసి, కోర్టుకు పంపడమే తరువాయి.భార్యను చంపినందుకు శేషయ్యకు జైలుశిక్ష తప్పదు. పాపం! పిల్లల పరిస్థితి ఏంటో? అనుకొని జాలిపడుతున్నారు జనం. కొత్తగా కట్టించిన డాబా ఇల్లుంది. పాడిపశువులున్నాయి. ధాన్యం పండే పొలం ఉంది. ఏం లాభం? పిల్లలే అనాథలయ్యారు. దిక్కులేని బతుకే కదా!

ఉదయం పది గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు రాజబాబు.వాడి చేతిలో గుడ్డసంచి మాత్రం ఉంది. ‘‘ఎవరు కావాలి?’’ అని అడిగాడు గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్‌.‘‘ఇన్స్‌పెక్టర్‌ అంకుల్‌’’ అన్నాడు.‘‘ఎందుకు? ఏ ఊరు నీది?’’‘‘పెదవడ్లపూడి. ఇన్స్‌పెక్టర్‌ అంకుల్‌తో మాట్లాడాలి.’’ఆ ఊరిపేరు చెప్పగానే అతనికి అర్థమైంది. రాధారాణి హత్యకేసులో తన తండ్రి స్టేషన్‌లో ఉన్నాడు. వీడు అతణ్ని కలవడానికి వచ్చాడని.రాజబాబు నేరుగా ఇన్స్‌పెక్టర్‌ రంగనాయకుల దగ్గరికి వెళ్లాడు.‘‘ఏంటి బాబూ! ఇలా వచ్చావ్‌? మీ నాన్నను చూడటానికా?’’ అన్నాడు రాజబాబుతో.రాజబాబు తలను అడ్డంగా ఊపాడు. సంచిలో నుంచి కొడవలిని తీశాడు. అది రక్తపు మరకలతో ఎండిపోయి ఉంది.‘‘సార్‌! మా పిన్నిని నేనే చంపాను’’ స్థిమితంగా చెప్పాడు.పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు రంగనాయకులు. రాజబాబును ఎగాదిగా చూశాడు. సన్నగా రివటలా ఉన్న ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు కొడవలితో గొంతుకోసి హత్య చేశాడా?‘‘నాకు చదువుకోవాలని ఉందండీ. మా అమ్మమ్మ ఊళ్లో బడికి పోయేవాణ్ని. మా నాన్న నన్ను తీసుకొచ్చేశాడు ఇక్కడికి. మా పిన్నికి నేనంటే కోపం. నన్ను గొడ్లు మేపి రమ్మంటది. పశువుల చావిడిలో పేడ ఎత్తి కడగమంటది. తిండి కూడా సరిగా పెట్టదు. ఏదో చాడీ చెప్పి నాన్న చేత తన్నిస్తుంది. జేమ్స్‌కు వండి పంపిస్తుంది కానీ నాకు పెట్టదు. ఊళ్లో పిల్లలంతా నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారండీ! అరేయ్‌ మీ పిన్ని జేమ్స్‌ దగ్గరికి పోతుందంటగా అంటారండీ. ఒకాయన నాకు చెప్పాడండీ. మీ పిన్నికి ఎదురు చెప్పకు. ఏ పని చెప్తే ఆ పని చెయ్యి. జేమ్స్‌తో సంబంధం గురించి ఎక్కడా వాగకు. లేకపోతే నువ్వు వాళ్లకు అడ్డు అని, నిన్నే చంపేస్తారని చెప్పారండీ’’ అన్నాడు చాలా అమాయకంగా.ఇన్స్‌పెక్టర్‌కి తల తిరిగింది. వాడు చెప్పిందంతా విని. రాధారాణి తన సరిహద్దులను దాటిందని అతనికి అర్థం అయింది. హింస ఎవరైనా ఎంతకాలమని సహిస్తారు? హద్దులు ఉంటాయి కదా! హద్దులు దాటితే ఎవరైనా తిరగబడతారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరుగుతుంది. సవతి కొడుకును ప్రేమగా ఆదరించాల్సిన రాధారాణి తన బాధ్యతను మరిచింది. వాడు ప్రేమరాహిత్యంతో బాధపడ్డాడు. మొండిగా, రాయిలా మారాడు. అందుకే హత్య చేశాడు.ఇన్స్‌పెక్టర్‌ రంగనాయకులు నిట్టూర్చాడు. రాజబాబును చూస్తే ఆయనకు జాలి కలిగింది. కానీ తాను మాత్రం ఏం చేయగలడు..! 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌