ట్రాంపొలీనింగ్‌ 

11 Mar, 2018 06:32 IST|Sakshi

దీని కథేంటో తెల్సా? 

చుట్టూ స్టీల్‌ ఫ్రేమ్, మధ్యలో ఫ్యాబ్రిక్‌ సెటప్‌ బిగించబడి ఉండే ఆట పరికరాన్ని ట్రాంపొలీన్‌ అంటారు. ట్రాంపొలీన్‌లో ఫ్యాబ్రిక్‌కు సాగే గుణం ఉండదు. దానికింద స్ప్రింగుల అమరికే ట్రాంపొలీన్‌కు ఆ గుణాన్ని తెచ్చిపెడుతుంది. ట్రాంపొలీన్‌ మీదకు ఎక్కి, ఎగురుతూ, గంతులేస్తూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఈ ఆటను ట్రాంపొలీనింగ్‌ అని, ట్రాంపొలీన్‌ జంప్‌ అని పిలుస్తారు. 1935లో లారీ గ్రిజ్‌వోల్డ్, జార్జ్‌ నిస్సెన్‌ ట్రాంపొలీన్‌ను కనిపెట్టారు. ఈరోజుకి ట్రాంపొలిన్‌ జంప్‌ దాదాపు అన్ని దేశాలకూ పరిచయమైంది. ట్రాంపొలీన్‌ అనే పేరు కూడా నిస్సెన్‌ పెట్టినదే. స్పానిష్‌ పదం నుంచి ఆయన ఈ పేరును కనిపెట్టాడు. మొదట్లో సరదాగా పిల్లలు ఆడుకునే ఈ ఆట కొన్ని దశాబ్దాల కాలంలో సీరియస్‌ గేమ్‌గా అవతరించింది.

జిమ్నాస్టిక్స్‌ చేసే అథ్లెట్స్‌ ట్రాంపొలీనింగ్‌లో ప్రయోగాలు చేస్తూ ఆడతారు. 2000వ సంవత్సరంలో ఇది ఒలింపిక్స్‌లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు ట్రాంపొలీనింగ్‌ ఒలింపిక్‌ గేమ్‌. డైవింగ్, స్కేటింగ్‌ చేసేవాళ్లు ట్రాంపొలీనింగ్‌ను తమ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం బాగా ఆడుతూంటారు.  అంతరిక్ష్యంలో వ్యోమగాములు అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి, భూమ్మీద ఉన్నప్పటి నుంచే ట్రాంపొలీనింగ్‌లో శిక్షణ పొందుతుంటారు.  
 

>
మరిన్ని వార్తలు