నీ చూపే చల్లని చిరుగాలై...

7 Jul, 2019 07:58 IST|Sakshi

‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి... ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌... సినిమాలతో సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఓటర్‌’ సినిమాతో ఆకట్టుకున్న సురభి ముచ్చట్లు...

నా బలం: పేరెంట్స్‌
ఇష్టమైన నటి: మాధురీ దీక్షిత్‌
కష్టమైన పాత్ర: మొదటి సినిమాలో చేసింది.
నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా నటినే! మరో సందేహమే లేదు!!
సమయం దొరికితే: మ్యూజిక్‌ వింటాను. నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాను.
సౌత్‌లో నచ్చిన నటి: అనుష్కా శెట్టి
లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌: సహనం. నాలో ఓపిక, సహనంలాంటివి చాలా తక్కువ. సినిమాల పుణ్యమా అనే సహనాన్ని అలవర్చుకున్నాను.
నచ్చిన డైరెక్టర్లు: ఈ జాబితా చాలా పెద్దది గురూ!
ఫ్యాషన్‌ సెన్స్‌: సింపుల్‌గా ఉండాలి. బాడీకి సూట్‌ కావాలి. అతిగా ఉండకూడదు.
నచ్చిన ప్రదేశం: గ్రీస్‌
నచ్చిన గాయని: లతా మంగేష్కర్‌
నచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌:  ఏఆర్‌ రెహమాన్‌
హైదరాబాదీస్‌: 1. సినిమాలను బాగా ఎంజాయ్‌ చేస్తారు.
 2. భోజనప్రియులు.
3. మంచి మనసున్న మనుషులు
బాగా ఆడే ఆట: క్యారమ్స్‌
బాగా చూసే ఆట: రేసింగ్‌ గేమ్స్‌
మ్యూజిక్‌లో ఇష్టపడే జానర్‌: జాస్‌
నచ్చే పేరు: లిపిక
ఫస్ట్‌ క్రష్‌: హృతిక్‌ రోషన్‌
నచ్చే పానీయం: స్ట్రాబెర్రీ
 బలహీనత: నా స్వీట్‌నెస్‌?
సూపర్‌ పవర్‌ ఉంటే?: ఎదుటి వాళ్ల మనసులను చదువుతాను.
ఫెవరైట్‌ స్పైస్‌: గ్రీన్‌చిల్లీ
ఫెవరెట్‌ టీవీ షో: కపిల్‌శర్మ షో
బోధించడానికి ఇష్టపడే సబ్జెక్ట్‌: సైకాలజీ
ఊత పదాలు: సా...ర్, అచ్ఛా
చేయాలనుకునే రోల్స్‌: ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలని ఉంది.
లవ్‌ మ్యారేజ్, అరేంజ్డ్‌ మ్యారేజ్‌: ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. రెండిట్లో ఏది ఉత్తమం అనేదాన్ని పక్కన పెడితే...పెళ్లికి ముందు భాగస్వామి గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
ఎలాంటి భర్త కావాలి: జెంటిల్‌మెన్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. తాను చేసే పనిని గౌరవించాలి. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం’ అనే భావం ఉండకూడదు.
ఇష్టమైనది: ప్రకృతి ఆరాధన.

మరిన్ని వార్తలు