ఛత్తీస్‌గఢ్‌ ఎఫెక్ట్‌!

14 Apr, 2019 03:41 IST|Sakshi

అది ఒక ఆఫీసు.‘‘సార్‌... మీకు కొరియర్‌’’ అన్న పిలువుతో బయటికి వచ్చాడు పిచ్చయ్య.ప్యాకెట్‌ విప్పి చూశాడు. ఆశ్చర్యం! ఒక వస్తువుతో పాటు చిన్న చీటీ కూడా ఉంది.∙∙ బద్దం బాలశేఖర్‌...బ్యాండ్‌ మేళం అనే కంపెనీకి బాసు. అతనికి ఆరోజు కొరియర్‌ వచ్చింది. తన కంపెనీ నుంచి రాజీనామా చేసిన పిక్కేష్‌ నుండి అది వచ్చింది. ప్యాక్‌ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్నచీటీ కూడా ఉంది.కవి కప్పడప్పుల అప్పారావు ఇల్లు. ‘కొరియర్‌’ అనే కేకతో హడావిడిగా బయటికి వచ్చాడు అప్పారావు.ప్యాక్‌ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్న చీటీ. కేవలం వీరికి మాత్రమే కాదు....తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి కొరియర్‌లే. ‘‘మీకు కొరియర్‌ వచ్చింది’’ అనే మాట విని ప్రజలు బెంబేలెత్తుతున్నారు!

‘‘రాజా! కొరియర్‌ అనే పిలువు వినబడగానే...మనసులో  ఆనందం తొంగిచూస్తుంది.... అలాంటిది... కొరియర్‌ అనే మాట వినగానే ప్రజలు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పలేకపోయావో....నీకు అర్జంటుగా కొరియర్‌లో ప్యాకెట్‌ వస్తుంది...’’ అని బెదిరించాడు బేతాళుడు.‘‘ఈమాత్రం దానికి కొరియర్‌ దాకా ఎందుకు వెళతావు...చెబుతాను’’ అంటూ చెప్పడం  మొదలు పెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒక్కో టైమ్‌లో ఒక్కో  ట్రెండ్‌ రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆమధ్య కాలంలో లగేరహా మున్నాభాయి  సినిమా ఎఫెక్ట్‌తో ఎదుటివారికి తమ నిరసనను పూలు ఇచ్చిప్రదర్శించేవారు. ఇప్పుడు అద్దాలు  వచ్చాయి. ఒక్కసారి వెనక్కి వెళదాం....పిచ్చయ్య ప్యాకెట్‌ విప్పి చూశాడు.అద్దం!చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది....‘‘ప్రియమైన శ్రీవారికి...మీ ఫేసును అద్దములో ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకోకపోతే ఇప్పుడు చూసుకోండి.లేకుంటే ఏమిటి! పొద్దున నేను చేసిన టిఫిన్‌కు వంకలు పెడతారా!ఇట్లు మీ శ్రీమతికాంతం(బీయే)

బాస్‌ బద్దం బాలేశేఖర్‌ కొరియర్‌లో వచ్చిన అద్దాన్ని చూసి ఆశ్చర్యపోయి ‘‘ఈ అద్దాన్ని ఎవరు పంపించారు. ఎందుకు పంపించారు?’’ అనుకుంటూనే చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘‘మొన్న ఆఫీసుకు  పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు...పది గంటల పాటు నాన్‌స్టాప్‌గా తిట్టారు. అందుకే జాబ్‌కు రిజైన్‌ చేశాను. ఇప్పుడు హాయిగా ఉంది. నా హాయి సంగతి సరేగానీ...నీ ఫేస్‌ను ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అసలు నీది మనిషి ఫేసేనా? నాకు ఎందుకో డౌటుగా ఉంది. ఒక్కసారి నీ ఫేసు అద్దంలో చూసుకొని చెప్పగలవు.ఇట్లుమీ మాజీ ఉద్యోగిమక్కి పిక్కేష్‌

కవిగారు ప్యాకెట్‌లో వచ్చిన అద్దాన్ని చూసి...‘నాకు మామూలుగా కొరియర్‌లో  పుస్తకాలు వస్తాయి. ఇదేమిటి ఈరోజు అద్దం వచ్చింది’ అనుకుంటూ చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘నిన్న మీ కవితలు విని అందరూ ఆహో ఒహో అన్నారు. కానీ నేను అనలేకపోయాను. నా వైపు అదోలా చూశారు. అసలు నువ్వు కవివేనా? నీ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?‘‘దూరంగా చూస్తే దోమనేఇక్కడి నుంచి చూస్తే ఈగనేకానీ...నేను పులినినిన్ను నిలువెల్లా చెక్కే ఉలిని’’ఇది కవితా? నీ పిండాకూడా!ఇట్లుకె.పాఠక్‌రావు, పాయకరావుపేట

కొరియర్‌లో వచ్చిన అద్దాన్ని చూసి ‘మా ఇంట్లోనే బోలెడు అద్దాలు ఉన్నాయి. షూటింగ్‌ స్పాట్‌ నుంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చిన అద్దాల సంగతి సరే సరి. ఈ అద్దాన్ని ఎవరు పంపించారు?’ అనుకుంటూ చీటీచదివాడు కొత్త హీరో పోత పాపారావు. అందులో ఇలా ఉంది...‘‘అయ్యా! నేను డైరెక్టర్‌ క్లాప్‌కుమార్‌ని. వరుసగా తొమ్మిది హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించాను. నా ఖర్మగాలి పదో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. బొత్తిగా అవకాశాలు లేకపోవడంతో నా ఖర్మగాలి...మీకు కథ చెప్పాను.ఏమన్నారు?!‘రౌడీలను చితక్కొట్టి బోర్‌ కొడుతుందయ్యా...ఈసారి కొత్తగా ప్లాన్‌ చేద్దాం.  వంద ఏనుగులు ఒకవైపు...నేను ఒకవైపు...చితక్కొట్టేస్తాను...ది గ్రేట్‌ ఎలిఫెంట్‌ ఫైట్‌గా ఈ ఫైట్‌ చరిత్రలో నిలిచిపోతుంది.’‘వాన పాటలేంటీ, వేరీ బోర్‌! ఈసారి వెరైటీగా నిప్పుల పాట పెడదాం. పైన వేడి వేడిగా నిప్పులు కురుస్తుంటే...హీరోయిన్‌తో నేను కూల్‌ కూల్‌గా డ్యాన్స్‌ చేస్తాను.’అయ్యా! మీ క్రియేటివ్‌ ఐడియాలు గుర్తు తెచ్చుకుంటుంటే కడుపులో డోకు వస్తుంది. మీరు హీరో ఏమిటండీ ఖర్మగాకపోతే! ఎందుకైనా మంచిది మీ ఫేస్‌ ఒకసారి అద్దంలో చూసుకోండి.ఇట్లుకె.క్లాప్‌ కుమార్, డైరెక్టర్‌ (లేస్తే మనిషిని కాను ఫేమ్‌)∙∙ ‘‘బేతాళా! ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే...మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఛత్తీస్‌గఢ్‌లో  ‘అద్దాల ఉద్యమం’ అని ఒక ఉద్యమం నడిచింది, ప్రత్యర్థికి ఒక అద్దం పంపి ‘నీకు అంతసీన్‌ లేదు. ఒకసారి నీ ఫేస్‌ అద్దంలో చూస్కో’ అని మెసేజ్‌ చేస్తుంటారు. ఇదే ఛత్తీస్‌గఢ్‌ అద్దాల ఉద్యమం’’అని ముగించాడు విక్రమార్కుడు.
– యాకుబ్‌ పాషా 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు

కుడి ఎడమైతే

ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...

మా ఆయన అపరిచితుడు

లైట్‌ హౌస్‌

ద్వారకామాయి

చక్కటి చుక్కలా

బ్యాంకులో ఓ రోజు

దేశ విభజనని శపించిన రాజర్షి

గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?

కరెంట్‌ తీగ

నాకు ఈ యుద్ధం వద్దు బావా!

3ఎస్‌

అత్తమ్మ

జీవితం

తల్లి

అనుమానాస్పదం

తల్లి మనసు

దోదో!

సదాశివా...చంద్రమౌళి!

బిడ్డ చాటు తల్లి

మిల మిల మెరిసే మీనాక్షి!

 వారఫలాలు

హత్యా?ఆత్మహత్యా?

ఈ సమయంలో బరువు పెరగొచ్చా?

రెండ్రూపాయలు

ప్రేమికుడు

సాయి వాణి యదార్థ భవిష్యవాణే

మృదువైన మెరుపు

డాడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ