వెబ్‌ సిరీస్‌ సంచలనం.. మిథిలా పాల్కర్‌

5 Jul, 2020 08:12 IST|Sakshi

మిథిలా పాల్కర్‌.. కప్పును మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని మిథిల పాడిన ‘హై చాల్‌ తురు తురు’  అనే మరాఠీ ప్రైవేట్‌ సాంగ్‌ ఒక్క రోజులోనే ఆమెను  యూట్యూబ్‌ స్టార్‌ను చేసింది.  సినిమా స్క్రీన్‌కు ఆమెను చూపించింది. సొంతూరు ముంబై. ఉండేది కూడా  అక్కడే.  మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుకుంది. ఫస్ట్‌ లవ్‌... థియేటరే. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడే క్యూ థియేటర్‌ ప్రొడక్షన్స్‌లో చేరింది. 

ఫిల్టర్‌ కాపీ... అనే యూట్యూబ్‌ చానెల్‌లో సెటైర్‌ షో ‘న్యూస్‌ దర్శన్‌’కు హోస్ట్‌గా, ధ్రువ్‌ సెహగల్‌తో కలిసి ‘ఎన్నాయింగ్‌ థింగ్స్‌ బాయ్‌ఫ్రెండ్స్‌ డు’ అండ్‌ ‘కన్‌ఫ్యూజింగ్‌ థింగ్స్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ సే’ అనే షోనూ నిర్వహించింది. ఈ వీడియోలూ వైరల్‌ అయ్యి మిథిలాను సెలెబ్రిటీని చేశాయి. 

మాఝా హనీమూన్‌... 
ఈ మరాఠీ షార్ట్‌ ఫిల్మ్‌లోని తన నటనతో బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయం చేసుకుంది మిథిల. ఆమె మొదటి హిందీ సినిమా ‘కట్టీ బట్టీ’. ఇందులో ఇమ్రాన్‌ఖాన్‌కు చెల్లెలుగా యాక్ట్‌ చేసింది. తర్వాత మరాఠీ సినిమా మురాంబాలోనూ హీరోయిన్‌ అయింది. అందులో పాట కూడా పాడింది.

నటనతోపాటు న్యాటం, సంగీతం కూడా ఉన్నాయి ఆమె ప్రజ్ఞాపాటవాల జాబితాలో. కథక్‌ నేర్చుకుంది. పాటంటే ప్రాణం.  ‘నా పాటే నన్ను  వర్ణిస్తుంది’ అంటుంది. గర్ల్‌ ఇన్‌ ద సిటీ, లిటిల్‌ థింగ్స్, చాప్‌ స్టిక్స్‌.. వెబ్‌ సిరీస్‌లతో మిథిలను తమ ఇంటి పిల్లగా అభిమానించడం మొదలుపెట్టారు వెబ్‌ ఆడియెన్స్‌. 

కారవాన్‌...
ఉత్తమనటులతో పోటీపడగల  మిథిల నటనాసామర్థ్యాన్ని చూపించింది.  ఈ సినిమాలో దుల్ఖర్‌ సల్మాన్, ఇర్ఫాన్‌ ఖాన్‌లతో కలిసి యాక్ట్‌ చేసింది ఆమె. అమ్మమ్మతాత దగ్గరే పెరిగింది. సంప్రదాయ మరాఠీ కుటుంబం. మిథిల.. నటనారంగాన్ని ఎంచుకోవడం ఆమె తాతకు ఇష్టం లేదు. మనవరాలి పట్టుదల చూసి కాదనలేకపోయాడు. ఇప్పుడు ఆమె ప్రతి సినిమా, ప్రతి సిరీస్‌.. అంతెందుకు ఆమె చేసే ప్రతి కమర్షియల్‌ యాడ్‌నూ చూసి ముచ్చటపడ్తాడట. స్క్రీన్‌ మీద మనవరాలిని చూసుకునేందుకు స్మార్ట్‌ ఫోన్‌ తెప్పించుకున్నాడట ఆమె తాత. ‘మా ఫ్యామిలీయే నా స్ట్రెంగ్త్‌. నా బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ ఎవరో తెలుసా? మా తాత. నేను ఎవరికి పే..ద్ద ఫ్యాన్‌నో తెలుసా.. మా తాతకు!’ అంటుంది మిథిలా పాల్కర్‌. 

మరిన్ని వార్తలు