వారఫలాలు( అక్టోబర్‌ 6 నుంచి 12)

6 Oct, 2019 08:31 IST|Sakshi

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి చేకూరుతుంది. మీపై కుటుంబసభ్యులు మరింత ఇష్టం చూపుతారు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
క్రమేపీ కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయవద్దు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. మీపై బ«ంధువులు మరింత ఆదరణ చూపుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు వీడతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్తగా చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగాల అన్వేషణలో విజయం సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. ప్రముఖుల  నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు. రాజకీయవర్గాలకు అప్రయత్నంగా అవకాశాలు రాగలవు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా దీక్షా, పట్టుదలతో అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తిపై సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వివాహ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. తరచూ అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో భూవివాదాలు నెలకొంటాయి. అందర్నీ ఆశ్చర్యపరిచేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కాంట్రాక్టర్లు దక్కుతాయి. నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలుసానుకూలం. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వేడుకలకు హాజరవుతారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం కలిగే సూచనలు. వారం చివరిలో అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపట్టే వీలుంది. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు