ఆక్టోపస్‌ ఆర్ట్‌

18 Feb, 2018 01:57 IST|Sakshi

నెయిల్‌ ఆర్ట్‌

నెయిల్‌ ఆర్ట్‌ అనగానే ఏవో నాలుగు గీతలు, వాటి చివర్లకు మూడు పువ్వులు అప్లై చేసుకుని మురిసిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ట్రెండ్‌ మారింది. ఎగిరే పక్షులు, ఈదే చేపలు ఇలా అన్నింటినీ ఆర్ట్‌గా మార్చి.. గోళ్లపై మెరిపిస్తున్నారు ఇప్పటి మగువలు. అందుకే మరి ఈ వారం సరికొత్తగా ఆక్టోపస్‌ నెయిల్‌ ఆర్ట్‌ని అందిస్తుంది.  మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. చూపరుల చేత ‘అహో.. అద్భుతం’ అనిపించుకోండి.

1.    ముందుగా నెయిల్స్‌ క్లీన్‌ చేసుకుని షేప్‌ చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి లైట్‌ బ్లూ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మధ్య వేలుకి రెడ్‌ కలర్‌ లేదా మీకు నచ్చిన డార్క్‌ కలర్‌తో (చిత్రంలో ఉన్న విధంగా) పెద్ద చుక్క పెట్టుకోవాలి.
2.    తరువాత మధ్య వేలుకు ఉన్న చుక్కకు పై భాగానికి ఇరువైపులా (చిత్రాన్ని గమనిస్తూ) గీతలు పెట్టుకోవాలి. తరువాత చూపుడు వేలు, ఉంగరపు వేలుకు కూడా చిత్రాన్ని అనుసరిస్తూ కాస్త వాలుగా గీతలు అప్లై చేసుకోవాలి.
3.    ఇప్పుడు ఆ గీతల చివరి భాగంలో అచ్చు చిత్రంలో ఉన్న విధంగా డిజైన్‌ చేసుకోవాలి.
4.    ఇప్పుడు వైట్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని గీతలకు చిత్రాన్ని చూస్తూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి. 
5.    తరువాత మధ్య వేలుకి ఉన్న డిజైన్‌లో (చిత్రాన్ని అనుసరిస్తూ) రెండు వైట్‌ చుక్కలు పెట్టుకోవాలి.
6.    ఇప్పుడు ఆ వైట్‌ చుక్కల్లో బ్లాక్‌ కలర్‌ చుక్కలు పెట్టుకోవాలి. తరువాత చిటికెన వేలు, బొటనవేళ్లకు ఇంతకు ముందు ఉపయోగించిన రెడ్‌ కలర్‌ లేదా మీరు ఎంచుకున్న డార్క్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని స్టార్స్‌ అప్లై చేసుకుని, వైట్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌తో చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటే అదిరే నెయిల్‌ ఆర్ట్‌ మీ సొంతమవుతుంది. 

మరిన్ని వార్తలు