నట్టింట్లో గెలాక్సీ!

1 May, 2016 04:25 IST|Sakshi
నట్టింట్లో గెలాక్సీ!

ఇంటికి - ఒంటికి
మీ ఇంట్లో పాతబడిన సీసాలున్నాయా..? అయితే మీ ఇంట్లో పాలపుంత (గెలాక్సీ) ఉన్నట్లే. ఎందుకంటే ఫొటోలో కనిపిస్తున్న గెలాక్సీ జార్లు తయారైంది ఆ పాత సీసాలతోనే. సాధారణంగా సీసాలు వాడే కొద్దీ మసగ్గా, అంద విహీనంగా కనిపిస్తుంటాయి. అలాంటివి మన ఇళ్లల్లో బోలెడన్ని ఉంటాయి. వాటిని పడేయకుండా, రీ మోడల్ చేసి... ఇలా కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే?
 
కావలసినవి: పాత సీసాలు, వివిధ రంగుల గ్లో ఇన్ ది డార్క్ పెయింట్స్ (షాపుల్లో దొరుకుతాయి), పెయింట్ బ్రష్
 తయారీ విధానం: ముందుగా సీసాలను శుభ్రం చేసుకొని, పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత పెయింట్‌ను ఓ దళసరి పేపర్ లేదా ఏదైనా మూతపై వేయాలి. బ్రష్‌తో కొద్ది కొద్దిగా పెయింట్‌ను తీసుకొని ఆ జార్‌పై చుక్కలు (చిన్నవి లేదా పెద్దవి) పెట్టుకోవాలి. అలా ఎన్ని రంగుల చుక్కలనైనా పెట్టుకోవచ్చు. చుక్కలే కాకుండా ఏవైనా డిజైన్లు కూడా వేసుకోవచ్చు.

కొన్ని జార్లకు ఒకే రంగు చుక్కలు, మరి కొన్నిటికి రకరకాల రంగుల చుక్కలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఎండలో కానీ బాగా వెలుతురున్న చోట రెండు గంటలపాటు ఉంచాలి. అప్పుడే ఆ పెయింట్ చార్జ్ అవుతుంది. తర్వాత వీటిని చీకట్లో పెడితే... నిజంగా పాలపుంతే మన ఇంటికి వచ్చిందా అనిపిస్తుంది. పిల్లల బెడ్‌రూముల్లో కనుక వీటిని బెడ్‌లైట్లుగా పెడితే భలే సరదా పడతారు.

>
మరిన్ని వార్తలు