భాషణం: వెళ్లి ఆడుకో పో..!

30 Nov, 2013 23:28 IST|Sakshi
భాషణం: వెళ్లి ఆడుకో పో..!

 పిల్లలున్న చోట ఆటలు ఉంటాయి. ఆటలు ఉన్న చోట అల్లరి ఉంటుంది. అల్లరి ఎక్కువైన చోట పెద్దలు కసురుకోవడమూ ఉంటుంది. మామూలే. పిల్లల ఏరియాలో పిల్లలు, పెద్దల ఏరియాలో పెద్దలు ఉన్నంత వరకు పర్లేదు. కొన్నిసార్లు పెద్దల మధ్యలోకి పిల్లలు వచ్చేస్తారు. పెద్దల పనుల్లోకి, పెద్దల మాటల్లోకి! అప్పుడు పెద్దవాళ్లకు కోపం వచ్చేస్తుంది. ‘వెళ్లి ఆడుకో ఫో’ అని ఒక తిట్టు తిట్టేస్తారు. ‘ఆడుకోమ్మా’ అనడం తిట్టు కాదు. ‘వెళ్లి ఆడుకో’ అన్నా, ‘ఆడుకో ఫో’ అన్నా తిట్టే. ఇంగ్లిషులో Go play with yourself! అంటారు. ఈవారం మనం play  తో వచ్చే కొన్ని మాటలకు అర్థాలు తెలుసుకుందాం.
 
 
 play అంటే enjoy, game, act అని మూడు సాధారణ అర్థాలున్నాయి. playకి ఉన్న ఇంకో అర్థం risk money. రిస్క్ మనీ అంటే రేసుల్లో, స్టాక్ మార్కెట్లలో పెట్టిన డబ్బు. ఇలాంటి వాటిలో డబ్బు వస్తే మూటలకొద్దీ వస్తుంది. పోతే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. అందుకే రిస్క్ మనీ అన్నారు. బిజినెస్‌లో పెట్టేదీ కూడా రిస్క్ మనీనే.
 play  అనే మాటతో వచ్చే  phrasal verbs  కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదా: play around. దీనర్థం to behave in a silly way  అని. బుద్ధిహీనంగా, తెలివితక్కువగా ప్రవర్తించడం అని. (Stop playing around and get on with your home work). play about  అన్నా కూడా ఇదే అర్థం.  
 ఞ్చడ ఛీౌఠీ అంటే తగ్గించి చెప్పడం, తగ్గించి చూపడం. (Military spokespeople tried to play down the seriousness of the disaster).
 ఞ్చడ ఠఞ అంటే ఎక్కువ చేసి చూపడం. (The official report plays up the likely benefits of the scheme, but glosses over the costs).
 ఞ్చడ ౌఠ్ట అంటే బహిర్గతం కావడం. (The debate will play out in the meetings and in the media over the next week or two).
 play chicken అంటే ఎవరు ధైర్యస్థులో తేల్చుకోడానికి ప్రమాదకరమైన ఆటలు ఆడడం, లేదా ప్రాణాంతకమైన పందేలు కాయడం. play hooky  అంటే స్కూల్‌కి తరచు డుమ్మా కొడుతుండడం.
 ఞ్చడ ఛీజీట్టడ అంటే ఆటలో మోసం చేయడం.
 play the fool అంటే ఎదుటివాళ్లను నవ్వించడానికి, వారి ధ్యాసను మళ్లించడానికి  పిచ్చివేషాలు వెయ్యడం. (Stop playing the fool, I'm trying to talk to you).
 play gooseberry  అంటే ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రేయసీప్రియులు ఏకాంతంగా ఉన్నప్పుడు  వాళ్ల మధ్యలోకి వెళ్లడం.   
 play both ends against the middle అంటే తగువులు పెట్టి లాభం పొందడం.
 play footsie అంటే టేబుల్ కింద దొంగచాటుగా కాలిని కాలుతో నొక్కడం. (He kicked off his shoes and started playing footsie with her).
 play hardball అంటే అనుకున్నది సాధించడానికి గట్టిగా నిలబడడం, దృఢచిత్తంతో ఉండడం.
 play for time అంటే మనం సిద్ధం అయ్యేవరకు పనిని జాప్యం చేయడం.
 play God అంటే తను చెప్పిందే వేదం అన్నట్లుండడం. (Genetic engineers should not be allowed to play God, interfering with the basic patterns of Nature).
 play with ear అంటే ప్రణాళికను బట్టికాకుండా, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.
 play to the gallery  అంటే... అందరూ చూడండీ అన్నట్లు ప్రవర్తించడం. దృష్టిని తమవైపు మళ్లించుకోవడం.
 
 All work and no play
 ఇదొక సామెత. ఎప్పుడూ పని పనీ అంటుంటే నిన్నెవరూ పట్టించుకోరని చెప్పడం. అస్తమానం పనిలో మునిగివుండే మనిషికి  మిగతా ప్రపంచంతో పని ఉండదు. కొన్నాళ్లకు ప్రపంచం కూడా  ఆ మనిషి గురించి ఆలోచించడం మానేస్తుంది. వేడుకలు, ఉత్సవాలకు కూడా అతనికి ఆహ్వానం అందదు. అతని పేరెత్తితేనే బోర్‌గా ముఖం పెట్టేస్తారు. ‘కొంచెం మార్పు ఉండాలోయ్, లేదంటే లైఫ్ డల్‌గా ఉంటుంది’ అని చెప్పేటప్పుడు కూడా ఈ సేయింగ్‌ని వాడతారు. పూర్తి సామెత ఇలా ఉంటుంది All work and no play (makes Jack a dull boy).
 

మరిన్ని వార్తలు