ఒక గ్లాస్‌ వైన్‌తోనూ గుండెజబ్బులు!

24 Dec, 2016 22:41 IST|Sakshi
ఒక గ్లాస్‌ వైన్‌తోనూ గుండెజబ్బులు!

పరిమిత మోతాదులో వైన్‌ తీసుకుంటే గుండెజబ్బులు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ఒక గ్లాసు వైన్‌ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్‌)ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గ్లాసు వైన్‌ తీసుకునేవారిలో హార్ట్‌ రిథమ్‌ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే గుండె లయలో సమస్య వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ.

ఇలా ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే సమస్యను ‘హాలీడే హార్ట్‌ సిండ్రోమ్‌’గా చెబుతుంటారు. ఎప్పుడో ఒకసారి మద్యం తాగుతామని లేదా చాలా అరుదుగా తీసుకుంటామని చెబుతూ మద్యం తీసుకునే వారిలో గుండె లయకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడో ఒకసారి తాగుతామని చెప్పే 65 ఏళ్లు పైబడిన ప్రతి 100 మంది లోనూ ఏడుగురు గుండె లయకు సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారనే ఆ అధ్యయన ఫలితాలను అమెరియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీకి సంబంధించిన ఒక జర్నల్‌లో ప్రచురించారు.

మరిన్ని వార్తలు